బంధాలను ప్రేమిస్తే కాదు.. అపురూపంగా చూసుకోవాలి జగతికి క్లాస్ పీకిన రిషి!

గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ పొందుతుంది.బుల్లితెర సీరియల్స్ లో అత్యధిక రేటింగ్ కైవసం చేసుకున్న ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయినా జగతి మహేంద్రను రిషి తన కారులో తీసుకుని ఇంటికి వెళ్తారు. ఇలా తన కొడుకు తనకు రక్తం ఇచ్చి తనని ఇంటికి తీసుకు వెళ్లడంతో జగతి సంతోషానికి అవధులు ఉండవు. ఇదే విషయాన్ని మహేంద్రతో చెప్పాలని తనకు మెసేజ్ చేస్తుంది. నా కొడుకు నాకు రక్తం ఇచ్చి నన్ను ఇంటికి తీసుకెళ్తున్నాడు అని తనకు మెసేజ్ పెట్టగా తన ఫోన్ ముందు ఉంటుంది. అది చూసిన రిషి ఆ మెసేజ్ డిలీట్ చేసి మహేంద్ర ఫోన్ తనకు ఇస్తారు.

ఇక ఇంటికి రాగానే రిషి జగతిని జాగ్రత్తగా ఇంట్లోకి తీసుకువెళ్తాడు.ఇక ధరణి వారికి హారతిస్తూ ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊర్లో వాళ్ళ అందరి దృష్టి వెళ్ళిపోవాలి అని దిష్టితీస్తుంది. మరోవైపు అది చూస్తూ నిలబడిన దేవయాని నిన్ను ఎన్నిసార్లు ఇంట్లో నుంచి తరిమేయాలని చూసిన మళ్లీ మళ్లీ ఇంటికి వస్తున్నావ్ అయినా నిన్ను ఎలా పంపించాలో నాకు తెలుసు కదా అంటూ మరొక ప్లాన్ వేస్తుంది.ఇక లోపలికి వెళ్ళగానే రిషి మేడం మీరు నా రూమ్ లో ఉండండి నేను డాడ్ దగ్గర ఉంటాను. వసుధార నువ్వు మేడంని లోపలికి తీసుకెళ్ళు అని చెబుతాడు.

మరోవైపు ధరణి తనకు హారతి ఇవ్వడంతో దేవయాని మండిపడుతుంది. అసలు నీకు ఎవరు చెప్పారు. హారతి ఇవ్వమని అని తనపై కోపం తెచ్చుకోగా పెద మామయ్య గారు చెప్పారు అంటూ కావాలంటే మావయ్యను కూడా అడగండి అంటూ తనని పిలుస్తుంది.దీంతో ఏంటమ్మా అంటూ ఫణింద్ర అక్కడికి రాగా ఏమైనా కాఫీ కావాలా మామయ్య అంటూ మాట మారుస్తుంది.ఇక జగతి ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి నీకు కాస్త దూకుడు ఎక్కువైంది ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతా అంటూ వార్నింగ్ ఇస్తుంది.

మరోవైపు జగతిని గదిలోకి తీసుకెళ్లిన వసుధార గది మొత్తం సర్దుతుంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు వసుధారా నేను నీతో ఎక్కువ రోజులు సేవ చేయించు కోవాలనుకోలేదు అంటూ చెబుతుంది.అదే సమయంలో రిషి అక్కడికి వచ్చి వసుధార మేడంకి జ్యూస్ తీసుకురా అని చెబుతాడు.ఇప్పుడేం వద్దు రిషి అని చెప్పగా నువ్వు వెళ్లి తీసుకురా వసుధారా అంటాడు.సర్ ఏదో మేడంతో మాట్లాడాలి అనుకుంటున్నాడేమో అని చెప్పి వసుధార బయటకు వెళ్తుంది. అప్పుడు రిషి జగతితో మాట్లాడుతూ…ఇప్పుడు ఎలా ఉంది మేడం మెడిసిన్స్ అన్ని కరెక్ట్ టైంకి వేసుకోండి తొందరగా రికవర్ కావండి అంటూ చెబుతారు.

మేడం మీరు ఇంట్లో నుంచి ఎందుకు వెళ్లిపోయారో ఏమో అవన్నీ నాకు తెలియదు ఆ విషయాలను పక్కన పెడితే ఈ యాక్సిడెంట్లో మీరు చిన్న గాయాలతో బయటపడ్డారు మీకు ఏమైనా అయి ఉంటే డాడ్ పరిస్థితి ఏంటి డాడీకి ఏమన్నా అయితే మీరు నేను తట్టుకోగలమా. డాడ్ కు మీపై ఎంత ప్రేమ ఉందో మీ కన్నా ఎక్కువ నాకే తెలుసు.. అదృష్టవశాత్తు ఎవరికి ఏం కాలేదు అంటూ రిషి చెబుతాడు. బంధాలను ప్రేమిస్తే కాదు అపురూపంగా చూసుకోవాలి మేడం అంటారు.

బంధం గురించి గొప్పగా ఒక మెసేజ్ పెట్టడం కాదు మేడం.ఇక డాడ్ కి మీరు ఏదో మెసేజ్ పెట్టారు. దాన్ని నేను డిలీట్ చేశాను.ఒక బంధాన్ని కోరుకుంటే దానికోసమే బతకాలి ఇక చచ్చిపోయిన పర్లేదు అని మీరు ఏదో మెసేజ్ పెట్టారు. ఇలాంటి మెసేజ్ డాడ్ చూస్తే ఎంత బాధపడతారు అందుకే డిలీట్ చేశాను. డాడ్ సంతోషమే నాకు ముఖ్యం.డాడ్ కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే మిమ్మల్ని ఇక్కడికి రమ్మని రిక్వెస్ట్ చేశాను తనకోసం ఏం చేయడానికి అయిన తాను సిద్ధమేనని తన కళ్ళల్లో ఆనందం చూడాలనుకుంటానని ఈ సందర్భంగా రిషి జగతితో మహేంద్ర గురించి తనపై ఉన్న ప్రేమ ప్రేమ గురించి చెబుతాడు.