రైల్వే ట్రాక్ అంటూ వర్ష ఇమ్మానియేల్ పరువు తీసిన నిహారిక..?

బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో భాగంగా పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాల కోసం సినీ సెలబ్రిటీలు హాజరవుతూ బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తూ ఉంటారు.ఇలా బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలలో భాగంగా సినిమా సెలబ్రిటీలు పాల్గొని వారి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే మెగా డాటర్ నిర్మాణంలో తెరకెక్కిన హలో వరల్డ్ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ కోసం నిహారిక శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమానికి వచ్చారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేయడమే కాకుండా తన కామెడీ పంచ్ డైలాగులతో హైపర్ ఆది వంటి వారి నోరులను కూడా మూయించింది. ఇలా ఈమె శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమాల్లో భాగంగా హైపర్ ఆదినీ ఓ రేంజ్ లో ఆడుకుందని చెప్పాలి. నిహారిక దెబ్బకు హైపర్ ఆది తోకముడిచాడు. ఇదిలా ఉండగా ఈ కార్యక్రమంలో భాగంగా వేదికపైకి ఇమ్మానియేల్ రావడంతో వెంటనే తెగ ముద్దొచ్చేస్తున్నావోయ్ అనే బ్యాక్ గ్రౌండ్ సాంగ్ ప్లే చేశారు.

ఇలా ఈ సాంగ్ ప్లే చేయడంతో వెంటనే హైపర్ ఆది స్పందిస్తూ..వీడ్ని చూస్తే ఏ యాంగిల్ లో ముద్దొచ్చేలా ఉన్నాడు అంటూ దారుణంగా ఇమ్మానియేల్ పరువు తీశారు.అనంతరం ఇమ్మానియేల్ నిహారికతో మాట్లాడుతూ మేడం మీరు నాది వర్ష లవ్ ట్రాక్ చూస్తారా అని ప్రశ్నించారు.ఇమ్మానియేల్ ఇలా అడిగేసరికి నిహారిక సమాధానం చెబుతూ నేను ఖాళీగా ఉంటే రైల్వే ట్రాక్ అయినా చూస్తాను కానీ మీ లవ్ ట్రాక్ చూడనంటూ పంచ్ వేసింది. వెంటనే హైపర్ ఆది మాట్లాడుతూ వీరి లవ్ ట్రాక్ కూడా రైల్వే ట్రాక్ పైనే ఉండేది అంటూ మరోసారి పంచ్ వేసాడు.మొత్తానికి హైపర్ ఆది నిహారిక దారుణంగా ఇమ్మానియేల్ పరువు తీసారని చెప్పాలి.