అరేయ్ ఏంట్రా ఇది.. అప్పుడే బిగ్ బాస్ 5 కంటెస్టెంట్ అంటే ఎలా?

bigg boss 4 Telugu

బిగ్ బాస్ సీజన్ 4 మధ్యమధ్యలో కాస్త ట్రబుల్ ఇచ్చినప్పటికీ ఏండింగ్ లో మాత్రం ఫుల్ ఫుల్ జోష్ తో ఆదరగొట్టేసింది. రేటింగ్స్ అయితే గట్టిగానే రాబట్టింది. పెట్టిన పెట్టుబడి నిర్వాహకులకు లాభం కూడా వచ్చింది. ఇక క కంటెస్టెంట్స్ కూడా ఉన్నన్ని రోజులు మంచి ఆదాయం అందుకోవడమే కాకుండా జనాల్లో క్రేజ్ కూడా బాగానే సంపాదించుకున్నారు.

shanmuk

అయితే సీజన్ 4 అలా ముగిసిందో లేదో అప్పుడే సీజన్ 5కు సంబంధించిన రూమర్స్ మొదలయ్యాయి. సమ్మర్ ఏండింగ్ లో మొదలు పెట్టడానికి స్టార్ మా ప్లానింగ్ రెడీ చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక షో స్టార్ట్ కాబోయే విషయాన్ని పక్కనపెడితే.. అప్పుడే కంటెస్టెంట్ విషయంలో నమ్మలేని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. పలు యూ ట్యూబ్ కంటెట్స్ తో ఆకట్టుకున్న షణ్ముక్ మొదటి కంటెస్టెంట్ గా ఫిక్స్ అయినట్లు రూమర్స్ వస్తున్నాయి.

అరేయ్ ఏంట్రా ఇది.. అనే డైలాగ్ తో మొదటి నుంచి కూడా యూత్ లో మంచి క్రేజ్ అందుకున్న షణ్ముక్ రీసెంట్ గా సాఫ్ట్ వేర్ డెవలపర్ షార్ట్ ఫిల్మ్ తో కూడా నెవర్ బిఫోర్ అనేలా క్లిక్కయ్యాడు. సోలోగా ఎంటర్టైన్మెంట్ ఇవ్వగల కెపాసిటీ ఉన్న షణ్ముక్ ను బిగ్ బాస్ నిర్వాహకులు సంప్రధించినట్లు రూమర్స్ అయితే వస్తున్నాయి. రెమ్యునరేషన్ కూడా గట్టిగానే ఇస్తారట. మరి ఈ రూమర్ ఎంతవరకు వాస్తవమే తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.