హద్దులు మీరిన హైపర్ ఆది కామెంట్స్… ఆగ్రహాం వ్యక్తం చేస్తున్న నెటిజన్స్..?

బుల్లితెర మీద ప్రచారం అవుతున్న జబర్దస్త్ కామెడీ షో ద్వారా ఎంతో మంది కమీడియన్లుగా మంచి గుర్తింపు పొందారు. ఇలా జబర్దస్త్ ద్వారా గుర్తింపు పొందిన ఎంతోమంది బుల్లితెర మీద మాత్రమే కాకుండా సినిమాలలో నటిస్తూ వెండితెర మీద కూడా బాగా గుర్తింపు పొందారు. ఇలా బుల్లితెర, వెండితెర ప్రేక్షకులకు దగ్గరై గుర్తింపు పొందిన వారిలో హైపర్ ఆది కూడా ఒకరు. జబర్దస్త్ కామెడీ షో ద్వారా కమెడియన్గా ఫేమస్ అయిన ఆది ఆ తర్వాత సినిమాలలో నటించే అవకాశాలు కూడా అందుకున్నాడు. ఈ మేరకు సినిమాలలో కీలకపాత్రలో నటిస్తూనే బుల్లి తెరమీద ప్రసాదం టీవీ షోలలో సందడి చేస్తున్నాడు.

ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ, ఢీ, జబర్దస్త్ షోలలో ఆది తన పంచులు, సెటైర్లతో ప్రేక్షకులు నవ్వించే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే కొన్ని సందర్భాలలో తోటి కమెడియన్ల తో పాటు జడ్జి ల మీద కూడా సెటైర్లు వేస్తూ ఉంటాడు. అయితే ఆది వేసే సెటైర్లు కొందరికి నవ్వు తెప్పించినా,మరికొందరికి మాత్రం చాలా కోపం తెప్పిస్తాయి . ఇలా ఇప్పటికే ఆది చేసిన కామెంట్స్ ఎన్నో సార్లు వివాదంగా మారాయి. అయినప్పటికీ ఆది తన శైలి మాత్రం మార్చుకోవటం లేదు. ఇక ఇటీవల ఢీ షో లో పాల్గొన్న ఆది బిగ్ బాస్ కంటెస్టెంట్ జెస్సి గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇటీవల ఢీ షో కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ఎపిసోడ్ లో విలేజ్ స్పెషల్ గా జడ్జిలతో పాటు అందరూ సాంప్రదాయమైన దుస్తులు ధరించారు.ఇక హైపర్ ఆది బిగ్ బాస్ ఫేమ్ జెస్సి తో కలిసి కూరగాయలు అమ్ముతూ చాలా సరదాగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత ఏమేం కూరగాయలు తీసుకొచ్చారో అవన్నీ ఒక్కొక్కటిగా జెస్సి చూపించాడు. ఆ తర్వాత జెస్సీ బెండకాయ తీస్తుండగా బెండకాయ ని ఇంగ్లీష్ లో ఏమంటారు అని ఆది అడిగితే లేడీస్ ఫింగర్ అని హైపర్ ఆది అన్నాడు. ఇలా హైపర్ ఆది జెస్సి మగాడు కాదని ఇండైరెక్టుగా అతనిపై సెటైర్ వేశాడు. అయితే జెస్సీ గురించి ఆది ఇలా సెటైర్ వేయటంతో ఆది తన మాటలను అదుపులో ఉంచుకోవాలని నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.