‘అదిరింది’లో నవదీప్‌కు అవమానం.. అందుకే అక్కడ ప్రత్యక్షమయ్యాడు!!

అదిరింది షోలో నవదీప్, నాగబాబు, యాంకర్ రవి, భాను శ్రీ ఇలా అందరూ ఓ లెవెల్‌లో సెట్ అయ్యారు. అయితే ఏనాడూ కూడా షో అనుకున్నంతగా పేలలేదు. టీఆర్పీ విషయంలో జబర్దస్త్‌కు దరిదాపుల్లో కూడా లేదు. అయితే మొత్తాన్ని అదిరింది షోను 25 వారాల పాటు రన్ చేశారు. ఆ తరువాత ఈ షోకు రిపేర్లు చేయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో కొంతమందిని తీసేయడం, ఇంకొందరినీ చేర్చుకోవడం వంటివి చేశారు.,

Navdeep And Anchor Ravi In Dasara Special Event Akka Evare Athagadu
Navdeep And Anchor Ravi In Dasara Special Event Akka Evare Athagadu

మొత్తానికి బొమ్మ అదిరింది అనే షోలో రవి, భాను శ్రీ, నవదీప్‌లను తీసేశారు. కొత్తగా శ్రీముఖి, జానీ మాస్టర్‌ను తీసుకున్నారు. అన్ని మార్పులు చేర్పులు చేసి బొమ్మ అదిరిందిగా గత ఆదివారం షోను ప్రారంభించారు. ఆ ప్రారంభపు సెగ, అందులో వైఎస్ జగన్‌ను ఇమిటేట్ చేస్తూ వేసిన స్కిట్ వేడి ఇంకా తగ్గడం లేదు. అయితే మొదటి ఎపిసోడ్ వారు అనుకున్న దానికంటే ఎక్కువగానే పేలింది. కానీ ఇక్కడ ఓ విషయం మాత్రం అందరికీ డౌట్ కొడుతోంది.

Navdeep And Anchor Ravi In Dasara Special Event Akka Evare Athagadu
Navdeep And Anchor Ravi In Dasara Special Event Akka Evare Athagadu

బొమ్మ అదిరింది నుంచి నవదీప్ ఎందుకు వెళ్లిపోయాడు? వెళ్లిపోయాడా? తీసేశాడా? అన్న ఎన్నో అనుమానాలు అందరిలోనూ రేకెత్తాయి. అయితే తాజాగా నవదీప్ ఈటీవీలో దసరా స్పెషల్ ప్రోగ్రాం ‘అక్కా ఎవరే అతగాడు’లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. అక్కడ వారు వద్దంటే ఇక్కడి వచ్చి దుమ్ములేపాడు. యాంకర్ రవి, నవదీప్ ఇద్దరూ కలిసి ఈటీవీ దసరా సంబరాల్లో రచ్చ చేశారు. అక్కడ వీరికి అవమానం జరిగిందని, అందుకే ఇలా కౌంటర్ ఇచ్చారని తెలుస్తోంది.