బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నటువంటి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయాన్ని వస్తే… అభి, ప్రేమ్ శృతి లాస్య అంకిత అందరూ కూడా తులసి ఇంటికి వెళ్లి పార్టీ చేసుకుంటూ ఉంటారు. అయితే శృతి బెలూన్ పై కాలు పెట్టి ఒక్కసారిగా జారి కింద పడటంతో తన కడుపుకు బలంగా దెబ్బ తగులుతుంది దీంతో ఆమె నొప్పి అని అరవడంతో అందరూ కంగారుపడుతూ శృతిని హాస్పిటల్ కి తీసుకువెళ్తారు. ఇక తన కొడుకు కోడలు అందరూ కూడా తులసి ఇంట్లో పార్టీ చేసుకుంటున్నారని తెలిసి లాస్య నందు సీరియస్ గా అక్కడికి వెళ్తారు.
ఇక తులసి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో నందు ఎక్కడికి వెళ్లి ఉంటారని సీరియస్ గా అభి ప్రేమ్ తులసి అందరికీ ఫోన్ చేస్తూ ఉంటాడు. అయితే ఎవరూ కూడా ఫోన్ లిఫ్ట్ చేయరు.ఇలా ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి నన్ను చాలా కోప్పడతారు వాళ్ళు ఎక్కడున్నా సరే తెలుసుకొని మనం వెళ్లాలి అని తిరిగి మరొకసారి వాళ్లకు ఫోన్ చేస్తూ ఉంటాడు.మరోవైపు హాస్పిటల్ కి తీసుకెళ్లిన తర్వాత శృతి నొప్పి అని బాధపడుతూ ఉండగా డాక్టర్ రావడంతో జరిగిన విషయం మొత్తం చెబుతారు.
శృతిని ట్రీట్మెంట్ కోసం లోపలికి తీసుకెళ్లగా తులసి మాత్రం అసలు శృతిని నా ఇంటికెందుకు తీసుకువచ్చావు నేను దురదృష్టవంతురాలు అని తులసి బాధపడుతూ ఉండగా సామ్రాట్ తనని ఓదారుస్తాడు. మీరే ఇలా బాధపడితే పిల్లలు ఎలా తట్టుకుంటారు అని సామ్రాట్ ఓదారుస్తాడు.ఇక నందు అభి కి ఫోన్ చేయడంతో అభి కాస్త పక్కకు వెళ్లి తన డాడ్ తో మాట్లాడతారు ఎక్కడ ఉన్నారని నందు ప్రశ్నిస్తూ నేను తులసి ఇంటి దగ్గర ఉన్నాను మీరంతా ఎక్కడికి వెళ్లారు అని చెప్పడంతో డాడ్ మేమంతా సాయంత్రం ఇంటికి వస్తాం మీరు ఇంటికి వెళ్ళండి అని చెప్పినప్పటికీ ముందు మీరు ఎక్కడున్నారో చెప్పండి అంటూ కోప్పడతారు.
నందు ఇలా చెప్పేసరికి హాస్పిటల్లో ఉన్నామని జరిగిన విషయం మొత్తం చెబుతారు. దీంతో నందు చాలా ఆవేశంగా హాస్పిటల్ కి వెళ్లి తులసి మీద చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తాడు.అసలు నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావో తెలుసా నా కోడలు నా ఇంటికి వారసుడిని ఇవ్వబోతుంటే నా ఇంట్లో జరగాల్సిన వేడుకను నువ్వు అడ్డుకొని నీ ఇంట్లో ఎందుకు జరుపుకున్నావు నేను చేతకాడిని వాడిని అనుకున్నావా? నన్ను వానపామును చేసి ఆడిస్తున్నావు అంటూ నోటికొచ్చినట్టు మాట్లాడుతాడు.
ఇలా నందు తులసి పై మండిపడుతూ తనని కొట్టబోగా మధ్యలోకి సామ్రాట్ అడ్డు పడతాడు. ఇది మా ఫ్యామిలీ మేటర్ నువ్వు పక్కకు వెళ్ళు అంటూ నందు చెబుతాడు. అయినప్పటికీ సామ్రాట్ వినకపోయేసరికి నువ్వు నీ హీరోయిజం మీరిద్దరూ ఒంటరిగా ఉన్నప్పుడు చూపించుకోండి ముందు పక్కకు జరుగు అంటూ లాస్య కూడా సామ్రాట్ ను నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.