ఇంటిని తాకట్టు పెట్టబోతున్న నందు…. విషయం తెలిసి అడ్డుపడాలని ప్రయత్నిస్తున్న తులసి!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే…లాస్య బిజినెస్ స్టార్ట్ చేయడం కోసం ఇంటిని తాకట్టు పెట్టడం ఒక్కటే మార్గమని చెబుతుంది అంతేకాకుండా తన కుటుంబ సభ్యులందరూ తనని దూరం పెట్టారని లాస్య నందుని రెచ్చగొడుతుంది. అయితే అదే సమయంలోనే తులసి దగ్గర నుంచి తన ఫ్యామిలీ మెంబర్స్ ఇంటికి రావడంతో లాస్య వారితో మాట్లాడమని చెబుతుంది. దీంతో నందు వారిని అడ్డుకుంటారు.

ఈ ఇంట్లో నా మాటకు విలువ లేదా నేనంటే గౌరవం లేదా అని ప్రశ్నిస్తారు.నీకు విలువ లేదని మేము ఎవరో అనుకోవడం లేదు నీకు నువ్వు అపార్థం చేసుకుంటున్నావు అని పరంధామయ్య చెబుతాడు. మరి హాస్పిటల్లో ఆ తులసి వాళ్ళ అమ్మ అనబోతుంటే అత్తయ్య అని పిలువు అని అనసూయ చెబుతుంది.ఆవిడ నన్ను అన్ని మాటలు అంటూ ఉంటే మీరు ఒక్కరు కూడా నాకు సపోర్ట్ చేయలేదు అని నందు కోప్పడతాడు. నందు ఇలా అడిగేసరికి తన కుటుంబ సభ్యులందరూ కూడా నువ్వే తప్పు చేశావు…అమ్మ గురించి నువ్వు అలా మాట్లాడుతుంటే మాకే ఎలాగో ఉంది. ఇక తన కూతురు గురించి అలా మాట్లాడటంతో అమ్మమ్మ బాధపడటంలో తప్పు లేదని కుటుంబ సభ్యులందరూ తనకి ఎదురు తిరుగుతారు.

తులసి ప్రాణాలను కాపాడటం కోసమే సామ్రాట్ కేవలం భర్త స్థానంలో సంతకం చేశాడని పరంధామయ్య చెబుతాడు.ఇక మీరందరూ చెప్పినది నేను విన్నాను అయితే నేను చెప్పేది మీరు వినండి బిజినెస్ కోసం నేను ఈ ఇంటిని తాకట్టు పెట్టబోతున్నాను అని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఇది కేవలం ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వాలి కాబట్టే ఇస్తున్నాను మీ నిర్ణయంతో నాకు పనిలేదని నందు చెప్పి వెళ్ళిపోతాడు. ఇకఈ విషయాన్ని శృతి తులసికి ఫోన్ చేసి అంకుల్ ఆంటీ ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు ఇంటిని తాకట్టు పెట్టబోతున్నారు అని చెప్పడంతో తులసి అంత అవసరం ఏమొచ్చింది అని అడుగుతుంది. ఏదో బిజినెస్ కోసం అని చెప్పారు ఆంటీ అని శృతి జరిగినది మొత్తం చెబుతుంది.

ఇక ప్రేమ్ ఆఫీస్ కి గిటార్ తీసుకొని వెళుతూ ఉండగా..ఇప్పుడు కూడా వెళ్లాలా కాసేపు నాతో కూర్చొని మాట్లాడొచ్చు కదా అంటూ శృతి అడగడంతో తాను ఇప్పుడు ఆఫీసుకు వెళ్లకపోతే కడుపులో ఉన్న బుజ్జి దాని కోసం డబ్బు అవసరం అవుతుంది కదా వెళ్లాలి అంటూ ప్రేమ చెబుతాడు. అయితే తన దగ్గర ఉన్న డబ్బును లెక్కపెడుతూ ఉండగా అది చూసిన లాస్య ఆ డబ్బులు మొత్తం తీసుకెళ్లి అవసరం అయితే అడుగు ఇస్తాను అంటుంది దాంతో శృతిని హాస్పిటల్ కి తీసుకెళ్లాలి అని ఆలోచిస్తూ ప్రేమ్ చిరాకు పడతాడు.అయితే హాస్పిటల్ ఖర్చులకోసం ఎవరిని అడిగిన డబ్బు సర్దకపోవడంతో చేసేదేమీ లేక తన వద్ద ఉన్న గిటార్ అమ్మేస్తాడు.

ఇక గిటార్ అమ్ముతూ ప్రేమ్ మాట్లాడిన మాటలు విన్న తులసి ఎంతో బాధపడుతుంది బయటకు వచ్చిన తర్వాత సాలరీ పడింది కదా ఆ డబ్బు ఏం చేస్తావ్ ప్రేమ్ అని అడగడంతో మా ఇంట్లో ఒక రాక్షసి ఉంది కదా తను లాగేసుకుంది అని చెప్పడంతో తులసి బాధపడుతుంది.ఎలాగైనా లాస్య ఆగడాలను అడ్డుకోవాలని ఇంటి తాకట్టును కూడా అడ్డుకోవాలని తులసి అనుకుంటుంది. మరోవైపుఅనసూయ పరంధామయ్య తినడానికి కూర్చోగా లాస్య తినడానికి తీసుకువస్తానని చెప్పి తిరిగి రాదు.