బిగ్ బాస్ వేదికగా సీపీఐ నారాయణకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన నాగార్జున.. విషయం ఏమిటంటే?

బుల్లితెర మీద ప్రసారమవుతున్న అతిపెద్ద రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షోని ప్రేక్షకులు ఎంతగానో ఆదరిస్తున్నారు. అయితే కొంతమంది ప్రేక్షకులతో పాటు మరి కొంతమంది రాజకీయ నాయకులు కూడా ఈ రియాలిటీ షో మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బిగ్ బాస్ షో వల్ల ప్రజలు చెడిపోతున్నారని విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో సీపీఐ నారాయణ కూడ బిగ్ బాస్ షో మీద విమర్శలు చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇటీవల నారాయణ మరింత రెచ్చిపోయి షో మీద తీవ్రస్థాయిలో విమర్శలు చేయడమే కాకుండా నాగార్జునని కూడా విమర్శించాడు.

ఇటీవల నారాయణ బిగ్ బాస్ షోని ముంబైలో ఉన్న రెడ్ లైట్ ఏరియాతో పోల్చాడు. అంతేకాకుండా ఈ షోలో నాగార్జున అమ్మాయిల ఫోటోలు చూపించి ఎవరిని ప్రేమిస్తావు? ఎవరితో డేటింగ్ చేస్తావు? అంటూ ప్రశ్నిస్తున్నాడు. నాగార్జున వారి కుటుంబంలో ఉన్న మహిళల ఫోటోలు పెట్టి అలా అడగమని చెప్పండి అంటూ నారాయణ తీవ్రస్థాయిలో విమర్శలు చేశాడు. అయితే చాలాకాలంగా బిగ్ బాస్ షో గురించి నారాయణ చేస్తున్న విమర్శల పట్ల నాగార్జున సైలెంట్ గా ఉంటూ ఆ విమర్శలను తేలికగా తీసుకున్నాడు. కానీ ఇటీవల నారాయణ మరింత రెచ్చిపోయి నాగార్జునని కూడా విమర్శిస్తున్నాడు. దీంతో నాగార్జున కూడా నారాయణకి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు.

ఇటీవల బిగ్ బాస్ సీజన్ 6 శనివారం జరిగిన ఎపిసోడ్ లో రోహిత్ ,మెరీనా జంటని లేపి అందరి ముందు ఒకరినొకరు కౌగిలించుకోమని నాగర్జున చెప్పాడు. మీరిద్దరూ భార్యాభర్తలు. ఒకరినొకరు కౌగిలించుకునే హక్కు మీకు ఉంది అంటూ.. నారాయణ నారాయణ అంటూ నారాయణ మీద స్ట్రాంగ్ కౌంటర్ వేశాడు. ఇంతకాలం బిగ్ బాస్ షో గురించి నారాయణ చేస్తున్న విమర్శల పట్ల మౌనంగా ఉన్న నాగార్జున అతని విమర్శల తీవ్రత ఎక్కువ కావడంతో ఇలా స్పందించాల్సి వచ్చింది. నారాయణ ఈ విషయం పట్ల సైలెంట్ గా ఉండకపోతే నాగార్జున కూడా మరింత రెచ్చిపోయే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.