నాగార్జునకి వేరే ఛాన్స్ లేదు.. రిపీట్ చేస్తేనే వుండాలె.!

బిగ్ బాస్ సీజన్ 5 హోస్ట్ అక్కినేని నాగార్జున, అర్థం పర్థం లేని డ్రామా అలాగే కొనసాగించాల్సి వస్తోంది. రాహుల్ సిప్లిగంజ్, అఖిల్ సార్థక్.. ఈ ఇద్దరితోనూ ఆడిన ఫేక్ ఎలిమినేషన్ డ్రామానే ఇంకోసారి లోబోతో ఆడాల్సి వచ్చింది. తప్పదు, బిగ్ బాస్ ఆదేశాలు అలాగే వున్నాయ్ మరి.

నిన్నటి హైడ్రామా ముందే లీక్ అయిపోయింది అందరికీ. లోబో సీక్రెట్ రూంలోకి వెళతాడనే ప్రచారం సోషల్ మీడియాలోనూ, మెయిన్ స్ట్రీమ్ మీడియాలోనూ జరిగిపోయాక, ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యింది. దాంతో, నాగ్ స్టేజీ మీద యాక్టింగ్ చేసేస్తోంటే వీక్షకులు నవ్వుకోవాల్సి వచ్చింది.

ఓటింగ్ ద్వారా తప్ప, బిగ్ బాస్ హౌస్ నుంచి ఏ హౌస్ మేట్ అయినా ఎలిమినేట్ అవడం అసాధ్యం అని చెప్పేందుకు ఎన్ని డ్రామాలో.. అలా నమ్మించేందుకు ఎన్ని కష్టాలో. ఇదంతా నిజమని లోబో నమ్మేశాడా.? ఛాన్సే లేదు. అందుకే, సేఫ్ గేమ్ ఆడాడు. అందరికీ థంబ్స్ అప్ అనే చెప్పాడు.

సీక్రెట్ రూమ్ నుంచి అన్నీపరిశీలిస్తాడు, ఆటలో అసలు సంగతేంటో తెలుస్తాడు.. ఇదీ బిగ్ బాస్ స్కెచ్. అంత బుర్ర లోబోకి వుందా.? అన్నదే అసలు ప్రశ్న. అదేదో రవి లేదా శ్రీరామచంద్ర లాంటి స్ట్రాంగ్ కంటెస్టెంట్.. లేదంటే, సిరి లేదా కాజల్ లాంటి టిపికల్ క్యారెక్టర్‌ని సీక్రెట్ రూంలోకి పంపిస్తే ఇంకాస్త మజా వచ్చి వుండేదేమో.