ఆది, రామ్ ప్రసాద్ కి స్పెషల్ ఆఫర్ ఇచ్చిన మల్లెమాల.. ఎందుకో తెలుసా..?

ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ కామెడీ షో గత తొమ్మిది సంవత్సరాలుగా ఆటంకాలను అధిగమిస్తూ నిర్విజ్ఞంగా ప్రసారమవుతుంది. అయితే ఈ కామెడీ షో ద్వారా హైపర్ ఆది, సుధీర్, రాంప్రసాద్ వంటి వారు మంచి గుర్తింపు పొందారు. సుధీర్ జబర్దస్త్ కి దూరం కావటంతో ఆది, రాంప్రసాద్ మాత్రమే జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలకు మూల స్తంభాల నిలబడి నెట్టుకొస్తున్నారు. దీంతో మల్లెమాలవారు ఇతర టీం లీడర్లతో పోలిస్తే వీరిద్దరికీ స్పెషల్ ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

సాధారణంగా జబర్దస్త్ లో ఉన్న టీం లీడర్స్ వారు చేసే స్కిట్ ని ముందే రాసుకొని మల్లెమాలవారికి సబ్మిట్ చేయాలి. అక్కడి నుండి అప్రూవల్ తీసుకున్న తర్వాత టీం మెంబెర్స్ తో కలిసి ప్రాక్టీస్ చేసిన తర్వాత మాత్రమే వారు స్కిట్ పర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. కొన్ని సందర్భాలలో టీం లీడర్స్ రాసిన స్కిట్స్ ని మల్లెమాలవారు రిజెక్ట్ చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఆది రాంప్రసాద్ కి మాత్రం ఈ రూల్ వర్తించదు. ఎందుకంటే వీరు ఏం చేసినా కూడా ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుంది. అందువల్ల ఇతర టీం లీడర్లతో పోల్చితే అది రాంప్రసాద్ కి మల్లెమాలవారు ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఇక ఈటీవీలో ప్రసారమవుతున్న కామెడీ షోస్ లో ఆది, రాంప్రసాద్ రెమ్యునరేషన్ కూడా ఇతర టీం లీడర్లతో పోల్చితే చాలా అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనంతటికీ కారణం వీరిద్దరికి ప్రేక్షకులలో ఉన్న పాపులారిటీ. వీరిద్దరి మీద ఉన్న నమ్మకంతో వీరు ఎలాంటి స్కిట్ రాసినా కూడా మల్లెమాలవారు వెరిఫై చేయకుండానే డైరెక్ట్ గా స్టేజ్ మీద పెర్ఫార్మ్ చేసే అవకాశాన్ని కల్పించారు. జబర్దస్త్ లో అరుదైన అవకాశం వీరిద్దరికీ మాత్రమే ఉందని సమచారం.