బయటపడ్డ లాస్య అసలు రంగు…. ఛీకొట్టిన కుటుంబ సభ్యులు!

కుటుంబ కథ నేపథ్యంలో బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ భార్యకు భర్త విడాకులు ఇవ్వగా ఒంటరిగా జీవితంతో ఎలా పోరాడుతుందనే విషయాలను తెలియజేస్తూ బుల్లితెరపై ప్రసారమవుతున్న ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ రోజురోజుకు మంచి ఆదరణ సంపాదించుకుంటుంది. ఇక ఈరోజు ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… తులసి తన పేరు పై ఉన్న ఇంటిని తనకు తెలియకుండానే లాస్య పేరు మీదికి రాయించుకుంటుంది. ఈ క్రమంలోనే ఈ ఇంటి డాక్యుమెంట్స్ చూపించి అందరికీ షాక్ ఇస్తుంది.ఇది ఏంటి అని అడగ్గా ఈ ఇంటి పేపర్లపై నువ్వు సంతకాలు పెట్టి ఇచ్చిన డాక్యుమెంట్స్ అంటూ షాక్ ఇస్తుంది.

ఈ ఇంటిని తాను అత్తయ్య పేరు మీద కదా రాశాను అని అడగ్గా నువ్వు సంతకం మాత్రమే చేసావు ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉందనే విషయాన్ని చదవలేదు అంటూ లాస్య చెబుతుంది. దీంతో నందుతో పాటు ఇంటి సభ్యులందరూ తనని అవమాన పరుస్తారు.ఇక తులసి మాట్లాడుతూ ఇలా మోసం చేసి ఇంటిని నీ పేరు మీద రాయించుకోవడం కన్నా అడుక్కొని ఉంటే ముష్టి అని వేసేదాన్ని కదా అంటూ తులసి అనడంతో ఒక్కసారిగా లాస్య తులసి అంటు గట్టిగా అరుస్తుంది. అప్పుడు తులసి తన మాటలతో లాస్యకి బుద్ధి చెబుతుంది.. అయినా మీరు ఎవరేమన్నా నేను పట్టించుకోను మీరందరూ నా వాళ్లే అంటూ లాస్య అనగా ఎప్పుడైతే నువ్వు మా అమ్మ నాన్నలను బాధ పెట్టావో అప్పుడే పరాయి మనిషివి అంటూ నందు సీరియస్ అవుతాడు.

అయినా ఇప్పుడు నేనేం తప్పు మాట్లాడలేదు మిమ్మల్ని అందరిని లోపలికే కదా రమ్మంటున్నాను అని చెప్పడంతో అభి ప్రేమ్ అందరూ కూడా మేము ఇంట్లోకి రామని చెబుతారు.ఇక నందు నువ్వేం డెసిషన్ తీసుకుంటావు మీరందరూ కలిసి మాట్లాడుకుని ఏ విషయము నాకు చెప్పండి అంటూ లోపలికి వెళ్తుంది. తులసి మాత్రం మామయ్య మీ అబ్బాయి చాలా బాధపడుతున్నారు. మీరందరూ ఇక్కడే ఉండి తనకు సపోర్ట్ చేయండి అని చెప్పి అందరినీ కలిపి వెళుతుంది దీంతో నందు చాలా సంతోషిస్తాడు.

ఇక సామ్రాట్ తులసి ఇద్దరూ వెళ్తూ మీరు మామయ్యని తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు సామ్రాట్ గారు అంటూ మాట్లాడుకుంటూ వెళ్తారు.నేను కూడా అంకుల్ని ఇక్కడికి తీసుకువచ్చి మొత్తం దేవుడిపై భారం వేసాను అయితే అది మంచికే జరిగింది అంటూ సంతోషంగా మాట్లాడుతూ ఉండగా కారు చెడిపోతుంది. దీంతో వీళ్ళిద్దరూ రోడ్డుపై మాట్లాడుకుంటూ సరదాగా జోకులు వేసుకుంటూ వెళ్తారు.