బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న కార్తీకదీపం సీరియల్ రోజురోజుకు ఎన్నో ట్విస్టులతో ప్రేక్షకులను సందడి చేస్తోంది.నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తే శౌర్య తన తల్లిదండ్రుల ఆచూకీ తెలుపమని డాక్టర్ చారుశీలను అడగాలని పోస్టర్ చేతిలో పట్టుకొని వస్తుంది.సారీ ని చూసిన డాక్టర్ ఆందోళన చెందుతూ ఇప్పుడు కనక కార్తిక్ ఇక్కడికి వస్తే పరిస్థితి ఏంటి అని తొందరగా సౌర్యను ఇక్కడి నుంచి పంపించాలని అనుకుంటుంది. ఇక శౌర్య ఏంటి ఇలా వచ్చావు అని చారుశీల అడగడంతో తన అమ్మానాన్నల కోసం వెతుకుతున్నానని తను మీకు కనిపిస్తే ఈ నెంబర్ కి ఫోన్ చేయమని చెప్పడమే కాకుండా ఆ పోస్టర్ హాస్పిటల్లో అతికించమని అడుగుతుంది.
ఈ విధంగా శౌర్య తన తల్లిదండ్రుల కోసం పడే ఆరాటం చూసి చారుశీల ఎంతో బాధపడుతుంది.అలాగే శౌర్య నేను ఈ పోస్టర్ ఇక్కడ అతికిస్తానని చెప్పి తనని అక్కడి నుంచి వెంటనే పంపిస్తుంది.మరోవైపు సౌందర్య కార్తీకదీపం కోసం వెతికి అలసిపోతుంది. అప్పుడు డ్రైవర్ అంజి కనిపించారా మేడం అని అడగడంతో అప్పుడే కనిపిస్తే ఆ దేవుడు ఎందుకు అవుతాడు మాకు ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నాడని సౌందర్య బాధపడగా ఎక్కడ ఉన్నా కార్తీక్ సార్, దీప మేడం కనిపిస్తారని అంజి చెబుతాడు. ఇక హాస్పిటల్లో సౌర్య అతికించిన పోస్టర్ చూసిన కార్తీక్ కళ్ళు ఎదుటే కూతురు ఉన్న తనని ఇంతలా ఇబ్బంది పెడుతున్నాను అంటూ చాలా బాధపడతారు. సౌర కోసం దీప మా కోసం శౌర్య వెతుకుతూ ఉన్నారు అని బాధపడతాడు.
మరి నిజం చెప్పేయొచ్చు కదా అంటూ చారుశీలఅంటుంది మీరు మంచి జరగడం కోసమే చెప్పలేదు కనుక ఈ విషయం గురించి ఇంతలా ఆలోచించడం మానేయండి అంటూ చెబుతుంది. మరోవైపు దీప సారీ కోసం ఆలోచిస్తూ ఉండగా ఏంటి దీపమ్మ ఎప్పుడు చూడు ఇలాగే ఆలోచిస్తూ ఉంటావు అని అడగడంతో తన కూతురు ఫోటో చూపించి ఎక్కడైనా చూసావా అని అడగడంతో ఈ ఫోటోలో ఉన్నది ఇంద్రుడు చంద్రమ్మ కదా వీళ్ళు మొన్ననే మా ఇంటి పక్కన అద్దెకు దిగారు. మనం అక్కడికి వెళ్దామంటూ ఇద్దరు ఆటోలో బయలుదేరుతారు.
మనం వస్తున్నట్టు వాళ్లకు తెలియదు కదా అని చెప్పగా మనం వాళ్లకు చెప్పలేదు కదా అని పండరి అంటుంది.వాళ్లు ఒకసారి నా చేతికి చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నారు అని దీప ఆందోళన చెందుతూనే కార్తీక్ కి ఫోన్ చేసి సౌర దగ్గరికి వెళ్తున్నానని తన అడ్రస్ దొరికిందని చెబుతాడు. ఇది విన్న కార్తీక్ షాక్ అవుతాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తిగా అవుతుంది. తర్వాత ఎపిసోడ్లో సౌర్య వాళ్ళు అక్కడ లేకపోవడంతో దీప కార్తీక్ ను అనుమానిస్తుంది.