దీపను బ్రతికించమని దేవుడిని ప్రార్థిస్తున్న కార్తీక్…..ఇంద్రుడిపై అనుమానపడుతున్న సౌందర్య!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే….దీప పడుకునే ఉండగా కార్తీక్ మాత్రం దేవుడికి ప్రత్యేకంగా పూజలు చేసి ఇప్పటివరకు నేను నిన్ను అది కావాలి ఇది కావాలని అడగలేదు ఇప్పుడు అడుగుతున్నాను ఎలాగైనా దీపప్రాణాలను కాపాడు అని దేవుడిని ప్రార్థిస్తూ పూజ చేస్తూ ఉంటాడు. ఇలా పూజ అయిన అనంతరం గంట కొట్టి హారతి ఇవ్వగా ఆ శబ్దానికి దీప నిద్ర లేస్తుంది. అయితే దీప నిద్రలేచి పైకి లేయబోతుండగా గుండెలో నొప్పిగా ఉండి లేవలేక పోతుంది. దీంతో నేనెందుకు లేవలేక పోతున్నానని దీప ఆలోచిస్తుంది అంతలోపే కార్తీక్ రావడంతో తను శక్తిని కూడగట్టుకొని పైకి లేస్తుంది.

లేచి కింద పడబోతుండగా దీప జాగ్రత్త అంటూ కార్తీక్ దగ్గరికి వెళ్తారు. ఇందాక నాకు లేవడానికి కూడా చేతకాలేదు డాక్టర్ బాబు మిమ్మల్ని చూడగానే ఏదో తెలియని శక్తి నాలో ఉంది అంటూ దీప మాట్లాడుతుంది.నీకు ఏమి కాదు దీప ఎప్పటికీ మనిద్దరం ఇలాగే ఉండాలని దేవుని ప్రార్థించాను అని కార్తీక్ చెప్పడంతో మిమ్మల్ని ఇలా చూస్తే చాలా సంతోషం వేస్తుంది డాక్టర్ బాబు కానీ ఒక విషయంలో మాత్రం మీరు మారరా అంటూ మరోసారి మాట్లాడబోతుండగా దీప ఇంక నువ్వేం మాట్లాడకు అంటూ కార్తీక్ మాట మారుస్తాడు.

మరోవైపు సౌందర్య కార్తీక్ రాసిన తీసుకొని చారుశీల వద్దకు వెళుతున్న దానిని చూపించడంతో చారుశీల షాక్ అయ్యి ఈ వేలకు కచ్చితంగా డౌట్ వచ్చింది అది కార్తీక్ హ్యాండ్ రైటింగ్ అని ఆలోచిస్తూ ఉండగా అంతలోనే సౌందర్య ఆలోచిస్తున్నావు ఇది నా కొడుకు కార్తీక్ చేతిరాత కానీ నువ్వు రాసావ్ అంటున్నారు ఇది నిజమేనా అనడంతో అవును ఆంటీ అంటుంది.అయితే చారుశీల ఆంటీ మిమ్మల్ని మాటికి ఇలా ఆంటీ అని పిలుస్తుంటే మీకు ఎలా అనిపిస్తుంది అనడంతో నువ్వు అలా పిలుస్తుంటే మోనిత అనే ఒక పనికిమాలినది నాకు గుర్తుకు వస్తుంది అని చెబుతుంది దాంతో చారుశీల షాక్ అవుతుంది.

మరోవైపు సౌందర్య ఆనందరావు మాట్లాడుతూ నేను దీపా కార్తీక్ లను వెతకడానికి వెళ్తున్న మీరు మాత్రం రాకండి ఇంట్లో శౌర్యహిమ ఇద్దరు కొట్టుకోనైన కొట్టుకుంటారు అని చెప్పడంతో మనకున్న వాళ్లను ఆపలేం కదా అని ఆనందరావు మాట్లాడతాడు అంతలోపే ఇంద్రుడును తనతో పాటు రమ్మనిసౌందర్య పిలవగా ఎక్కడికమ్మా అంటాడు దీపా కార్తీక్ లను వెతకడానికి అని చెప్పడంతో ఇంద్రుడు షాక్ అవుతాడు.అంతలోపే చంద్రమనే అక్కడికి పిలిచి ఈ రెండు రోజుల నుంచి గమనిస్తున్న నీకు నీ భార్య అంటే పంచప్రాణాలను అర్థమైంది అని తన చేతిని తీసుకుని తన భార్య తలపై పెట్టి ఇప్పుడు నిజం చెప్పు ఇంద్రుడు నీకు నిజంగానే నా కొడుకు కూడా లేదు ఎక్కడున్నారో తెలియదా అని అడుగుతుంది.

దాంతో ఇంద్రుడు శాఖ ఈ చేయి తీస్తూ ఉండగా చేయి తీయద్దని గట్టిగా అరుస్తుంది సౌందర్య. నిజం చెప్పమని బ్రతిమలాడుకున్నప్పటికీ వాళ్లు మాత్రం నిజం చెప్పరు.మరోవైపు దీప వంట చేస్తూ ఉండగా కార్తీక్ ఎందుకు దీపావళి చేయదని చెప్పాను కదా అంటే నేను బ్రతికి ఉండేది కేవలం కొద్ది రోజులు ఈ కొద్ది రోజులు అయినా నన్ను నాకు నచ్చినట్టుగా బతకనివ్వండి నన్ను ఆ పని ఈ పని చేయొద్దు అంటూ మరింత రోగిష్టి చేయకండి అంటూ బాధపడుతుంది. మరోవైపు సౌందర్య అంజని తీసుకొని దీప కార్తీక్ ల కోసం వెతుకుతూ ఉంటారు అయితే వీరిద్దరూ ఉన్న ఇంటికి దగ్గరలోనే సౌందర్య ఉంటుంది.