రిషికి మంగళసూత్రం ఇచ్చి పంపించిన జగతి…. షాక్ లో దేవయాని!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న గుప్పెడంత మనసు సీరియల్ నేడు ఎంతో ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది. నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే…జగతి మహేంద్ర దంపతులు వసుధారతో మాట్లాడుతూ వసుధార నువ్వు రిషి ఇద్దరు సంతోషంగా ఉండటమే మాకు కావాలి మీ సంతోషం కోసం మేము ఏం చేయడానికైనా సిద్ధమే అంటూ మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతున్నారు మేడం మీరు నాకు అర్థం కావడం లేదు అని వసుధార అనడంతో మేము ఎవరు మీ ఇంటికి రావడం లేదు నువ్వు ఒక్కదానివే మీ ఇంటికి వెళుతున్నావు అని జగతి చెబుతుంది.

అదేంటి మేడం మీరందరూ వస్తానని చెప్పారు కదా అంటూ వసుధార అనగా రాత్రి దేవయాని అక్కయ్య ఫోన్లో మాట్లాడటం మహేంద్ర విన్నాడట అందుకే మేము ఎవరు మీ ఇంటికిరాము నువ్వే వెళ్లి అక్కడ మీ నాన్నకి పరిస్థితి మొత్తం చెప్పి వాళ్లను ఒప్పించు అంటూ జగతి తనని ఒప్పిస్తుంది.ఇక మీ నాన్న గురించి నాకు తెలుసు ఆ రోజు కాలేజీలో టీసీ కోసం ఎంత పెద్ద గొడవ చేశారు. నేను తనతో చాలాసార్లు గొడవపడ్డాను.అక్కడ నన్ను చూస్తే మీ నాన్న కోపం తెచ్చుకుంటాడు. ఇక రిషి నా కొడుకు అని తెలిస్తే అసలు ఈ పెళ్లికి ఒప్పుకోడేమో అంటూ జగతి మాట్లాడుతుంది.

ఇక దేవయాని అక్కయ్య నీకు రిషికి పెళ్లి జరిపించడం ఏమాత్రం ఇష్టపడటం లేదు మిమ్మల్ని ఇద్దరినీ విడగొట్టాలని ప్రయత్నం చేస్తుంది. అందుకే నువ్వు అక్కడికి వెళ్లి ప్రశాంతంగా వారితో గడిపి సరైన సమయం చూసి విషయాన్ని చెప్పు అంటూ జగతి చెబుతుంది. ఆ తర్వాత రిషి వసుధార అన్న మాటల గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అలాగే మహేంద్ర జగతి వసుధార ఫ్యామిలీ గురించి మాట్లాడుకున్నటువంటి మాటలను విని షాక్ అవుతారు.జగతి మాటలు విన్నర్ రిషి ఆలోచనలో పడతాడు అదే సమయంలో రిషి వెళ్తుండగా మహేంద్ర చూసి ఎక్కడికి వెళ్తున్నావ్ రిషి అని అడగడంతో వెళ్లాల్సిన సమయం వచ్చింది డాడ్ అని చెబుతాడు.

అంతలో జగతి ఆగు రిషి అనడంతో నన్ను ఆపకండి మేడం అని రిషి చెప్పగా వెళ్లొద్దు అని నేను చెప్పడం లేదు. ఒక్క నిమిషం ఆగు అని చెప్పి రిషికి మంగళసూత్రం ఇస్తుంది.ఆ తర్వాత రిషి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోవైపు వసుధార ఒంటరిగా వెళుతూ నేను చాలా సంవత్సరాల తర్వాత ఊరికి వెళుతున్నాను అన్న ఆనందం కన్నా రిషి సార్ పక్కన లేరన్న బాద ఎక్కువగా ఉంది.రిషి సార్ కి నాతోపాటు రావాలనిపించడం లేదా అని మనసులో అనుకుంటూ ఉండగా వెంటనే రిషి వసుధార ముందు కారు ఆపుతాడు.ఇక వసుధారను తన కారులో తీసుకొని వాళ్ల ఊరికి వెళ్తూ సరదాగా మాట్లాడుకుంటారు అదే సమయంలో దేవయాని ఫోన్ చేసి నాన్న రిషి వెంటనే నువ్వు వెనక్కి రావాలి అనడంతో సారీ పెద్దమ్మ వసుదారని ఇలా వదిలి రాలేను అంటూ ఫోన్ కట్ చేయడంతో దేవయాని షాక్ అవుతుంది.