వెటకారాలు తగ్గించుకుంటే మంచిది.. శ్రీ సత్యకు వార్నింగ్ ఇచ్చిన పేరెంట్స్!

బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు కార్యక్రమం ప్రస్తుతం 12 వారం కొనసాగుతుంది. ఇక ఈవారం హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ హౌస్ లోకి వెళ్లడంతో ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే నిన్నటి ఎపిసోడ్ లో భాగంగా శ్రీ సత్య, ఫైమా పేరెంట్స్ హౌస్ లో సందడి చేశారు. బిగ్ బాస్ హౌస్ లోకి శ్రీ సత్య తల్లి తండ్రి ఇద్దరు వెళ్లగా ఆమె తన తల్లిదండ్రులను చూసి ఒక్కసారిగా ఎమోషనల్ అయింది

ఇక చాలా రోజుల తర్వాత తన కూతురిని చూడటంతో శ్రీ సత్య తల్లిదండ్రులు కూడా ఎమోషనల్ అయ్యారు. ఇక తన తల్లిదండ్రులతో కలిసి ఇతర హౌస్ మేట్స్ సైతం సరదాగా మాట్లాడుతూ సందడి చేశారు. అయితే చివరిగా వెళ్లే సమయంలో శ్రీ సత్య తండ్రి తనదైన స్టైల్ లో వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇలా శ్రీ సత్య గురించి తన తండ్రి మాట్లాడుతూ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన మొదట్లో చాలా బాగా ఆడావు అయితే ఇప్పుడు కాస్త ఎటకారాలు ఎక్కువయ్యాయి తగ్గించుకోమని చెప్పారు.

మొదట్లో ఎంతో అద్భుతంగా ఆట ఆడిన శ్రీ సత్య ఇప్పుడు కాస్త ఎక్కువ చేస్తున్నావని ముందు వాటిని తగ్గించుకో అంటూ తనకు వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఈ వీడియోలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఇక 12వ వారంలో భాగంగా హౌస్ లో ఉన్నటువంటి కంటెస్టెంట్లకు వాళ్ల పేరెంట్స్ రావడంతో ఒక్కసారిగా బిగ్ బాస్ హౌస్ లో సంతోషకరమైన వాతావరణం నెలకొంది. ఇక ఫైమా శ్రీ సత్యతో పాటు రోహిత్ తల్లి కూడా బిగ్ బాస్ హౌస్ లో సందడి చేశారు.