ఆ స్టార్ హీరోయిన్ ని ముద్దు పెట్టుకోవటానికి భయమంటున్న యంగ్ హీరో శేష్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో వైవిధ్యమైన సినిమాలలో నటిస్తూ హీరోగా మంచి గుర్తింపు ఏర్పరుచుకున్న అడవి శేషు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించడమే కాకుండా ఎన్నో వైవిధ్యమైన సినిమాలలో హీరోగా నటించి విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. ఇదిలా ఉండగా బాలయ్య హోస్ట్ గా వ్యవహరిస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 లో అడవి శేషు సందడి చేయనున్నాడు. ఇటీవల ప్రారంభమైన అన్ స్టాపబుల్ సీజన్ 2 ఇప్పటికే రెండు ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. తాజాగా మూడవ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల అయింది.

ఈ ప్రోమోలో ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్న శర్వానంద్, అడవి శేషు బాలకృష్ణతో కలిసి సందడి చేశారు. ఇక ఇద్దరి హీరోలు షో కి ఎంటర్ అవ్వగానే బాలకృష్ణకు గిఫ్ట్స్ ఇచ్చి సర్ప్రైజ్ చేశారు. ఇక ఈ షోలో బాలకృష్ణ ఇద్దరి యువ హీరోలతో కలిసి కుర్రాడిలా మారిపోయి రెచ్చిపోయాడు. ఇక ఈ షోలో ఇద్దరికీ ఫన్నీ టాస్క్ లు ఇచ్చి ఒక ఆట ఆడుకున్నాడు. అంతే కాకుండా ఈ ఇద్దరి హీరోలతో కలిసి డాన్స్ కూడా వేశాడు. ఇలా ఈ ఎపిసోడ్ మొత్తం చాలా సందడిగా సాగిపోయింది. అంతేకాకుండా ఒక సందర్భంలో ఏ హీరోయిన్ తో ముద్దు సీన్ చేయటానికి కష్టమని అడవి శేషుని బాలకృష్ణ అడగగానే ఏ మాత్రం ఆలోచించకుండా పూజ హెగ్డే అంటూ టక్కున సమాధానం చెప్పాడు.

అయితే పూజ హెగ్డే తో ఇలాంటి రొమాంటిక్ సీన్లు చేయాలని ఎందరో హీరోలు కలలు కంటూ ఉంటే అడవి శేషు మాత్రం పూజ హెగ్డే ని ముద్దు పెట్టుకోవడానికి భయపడుతున్నాడు. అయితే అడవి శేషు ఇలా భయపడటానికి కారణమేంటో తెలియాలంటే ఎపిసోడ్ మొత్తం చూడల్సి ఉంటుంది. ఇక ఈ ఎపిసోడ్ లో సినిమాకు సంబందించిన విషయాల గురించి కూడా ముగ్గురి మధ్య ఆసక్తికర చర్చలు జరిగాయి. ఇక బాలకృష్ణ పెళ్లి టాపిక్ ఎత్తగానే… ప్రభాస్, శర్వానందు లాంటి సీనియర్లు ఉండగా అప్పుడే ఎందుకు పెళ్లి చేసుకోవాలి అని అడవి శేష్ సమధానం చెప్పాడు. దీంతో నేనేమో ఆయన పేరు చెప్పుకొని తిరుగుతుంటే నువ్వు నా పేరు చెప్పుకొని తిరుగుతున్నావ్ అంటూ శర్వానంద్ అంటాడు. ఇలా ఈ మూడవ ఎపిసోడ్ మాత్రం చల్ సరదాగ ఉండబోతోంది.