Inaya Sultana: ప్రాణం ఉన్నంతవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటా… సోహైల్ కు ప్రపోజ్ చేసిన ఇనయ!

Inaya Sultana: బిగ్ బాస్ సీజన్ 6 కార్యక్రమం ద్వారా ఎంతో మందిని ఆకట్టుకున్నటువంటి ఇనయ సుల్తానా టాఫై కంటెస్టెంట్ గా నిలుస్తుందని అందరూ భావించారు. ఈమె ఆడిన ఆట తీరు ప్రతి ఒక్కరిని ఎంతగానో ఆకట్టుకుంది. ఇకపోతే ఈమె ఎలిమినేషన్ అన్పైర్ ఎలిమినేషన్ అంటూ కూడా ఎంతోమంది ఇనయ ఎలిమినేషన్ పై పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.

ఇకపోతే బిగ్ బాస్ కార్యక్రమంలో ఉన్న సమయంలో ఈమె సూర్యతో కలిసి పులిహోర వేషాలు వేసినప్పటికీ తన క్రష్ మాత్రం బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సోహైల్ అని పలు సందర్భాలలో వెల్లడించారు. అయితే ఈమె బిగ్ బాస్ నుంచి బయటకు రాగానే ఏకంగా సోహైల్ ను కలసి తనతో మాట్లాడటమే కాకుండా తనకు ప్రపోజ్ చేయడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

ఈ విధంగా సోహైల్ ను కలిసిన ఇనయ మీకోసం ఒక సర్ప్రైజ్ ఉందని చెప్పగా నువ్వు రావడమే నాకు షాకింగ్ గా ఉంది అంటూ సోహైల్ సమాధానం చెప్పారు.బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తను ఎక్కడికి వెళ్లలేదని సరాసరి ఇక్కడికే వచ్చానని ఆమె తెలిపారు.. దీంతో సోహైల్ థాంక్యూ అని రిప్లై ఇచ్చారు. అనంతరం ఒక రోజా ఫ్లవర్ బొకే తీసుకొని మోకాళ్ళ పై సోహైల్ ముందు కూర్చుని ఇనయ సోహైల్ కి ప్రపోజ్ చేసింది.

నువ్వంటే నాకు చాలా ఇష్టం సోహైల్…
ఒకటి చెప్పదలుచుకున్న నువ్వు ఏమనుకున్నా పర్వాలేదు.. నా మనసులో ఉన్నది నీకు చెప్పాలనుకున్న
సోహైల్ ఈ ప్రేమ ఉన్నంతకాలం కాదు.. నా ప్రాణం ఉన్నంతవరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. నువ్వంటే నాకు చాలా ఇష్టం అంటూ తన మనసులో మాట బయట పెడుతూ ఇనయ సోహెల్ కు ప్రపోజ్ చేసింది.అయితే ఈమె ప్రపోజల్ కు సోహైల్ ఎలాంటి సమాధానం ఇచ్చారో తెలియడం లేదు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.