శ్రీహాన్ పర్సనల్ విషయాలు బయటపెట్టిన ఇనయ … పర్సనల్ విషయాలు వద్దంటూ వార్నింగ్!

బిగ్ బాస్ సీజన్ 6 మొదలయ్యి ఇప్పటికే ఐదు రోజులు పూర్తి అయింది. ఈ ఐదు రోజులలో కంటెస్టెంట్ల మద్య గొడవలు బాగా ముదిరాయి . ఈ క్రమంలో కంటెస్టెంట్ల ప్రవర్తనతో ప్రేక్షకులు ఇప్పటికే విసుగు చెందినట్లు కనిపిస్తోంది. కొందరి కంటెంట్ల ప్రవర్తన పట్ల విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ 5వ రోజుకి సంబంధించిన ప్రోమో విడుదల అయింది. ఈ ఎపిసోడ్ లో బిగ్ బాస్ వరస్ట్ పర్‌ఫెర్మర్‌ని ఎంపిక చేసే టాస్క్ ఇచ్చాడు. ఈ క్రమంలో ఇంటి సభ్యులు తమ దృష్టిలో వరస్ట్ పెర్ఫార్మర్ ఎవరు అన్నదానికి రీసన్ చెప్పి వారి మొహాల మీద ముద్ర వేయాలి. ఈ విషయంలో ఎక్కువమంది గీత రాయల్ పేరు చెప్పి ఆమెను వరస్ట్ పర్ఫార్మర్గా తేల్చి చెప్పారు. ఇక గీత కూడా వారందరికీ ధీటుగా సమాధానాలు చెప్పింది.

ఈ క్రమంలో షో ప్రారంభం నుండి వివాదాల్లో నిలుస్తున్న ఇనయా సుల్తానా పేరుని ప్రస్తావిస్తూ కొంతమంది వరస్ట్ పర్‌ఫెర్మర్‌గా ఆమెకి ఓటు వేశారు. ఈ క్రమంలో హీరో బాలాదిత్య కూడా తనకు అర్థం కాలేదనే పర్సన్‌కి నేను వరస్ట్ పర్‌ఫెర్మర్‌గా ఓటు వేస్తానని చెప్పి ఇనయాకి ఓటు వేసాడు. దీంతో ఇనయ కూడా ఆదిత్యకి గట్టిగా కౌంటర్‌ ఇస్తు మీరు చెప్పినదాంట్లో కరెక్ట్ పాయింట్‌ లేదు, మీరు నన్ను తప్పు అంటే నేను ఒప్పుకోను అంటూ నిలదీసింది.

ఇలా వరస్ట్ పర్‌ఫెర్మర్ విషయంలో ఆదిత్యతో గొడవ తర్వాత ఇనయా , శ్రీహాన్ మద్య కూడా ఇదే విషయం గురించి గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇనయా శ్రీహాన్‌ ఎఫైర్స్ గురించి మాట్లాడింది. నాకు బయట ఎవరూ సపోర్ట్ లేరు. నేను ఎగ్జైట్‌ అవుతాను, సెల్ఫ్‌గా అప్పీల్‌ కూడా చేసుకుంటాను. కానీ నీకు బయట సిరి ఉంది. అంతే కాకుండా ఇంకా చాలమంది ఉన్నారంటూ రచ్చ చేసింది. దీంతో శ్రీహన్ కూడా పర్సనల్ విషయాలు తీసుకురావద్దు అంటూ ఇనయాకి వార్నింగ్ ఇచ్చాడు. ఇనయా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపుతున్నాయి.