తులసి సామ్రాట్ ఎదురుగా నందుకి ఘోర అవమానం… లాస్య పై ఎదురు తిరిగిన కుటుంబ సభ్యులు!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయానికి వస్తే…సామ్రాట్ తులసిని పార్టీ ఇవ్వమని అడగడంతో ఇద్దరు కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. అయితే అదే సమయంలో తులసి పర్స్ లో ఒక 500 పెట్టి రోడ్డుపై పడేస్తుంది. ఆ డబ్బు ఎవరి పేరున రాసి ఉంటే వారికే చెల్లుతుందని తులసి చెబుతుంది. అయితే ఆ పరిస్థితి చూసిన ఇద్దరి యువకులు అక్కడ సీసీ కెమెరా ఉంది తీసుకుంటే పట్టుబడతామని తీసుకోరు.

మరోవైపు నందు కారులో ప్రయాణం చేస్తూ తులసి గురించి తన తల్లిదండ్రులు మాట్లాడుకున్న విషయాలు గురించి ఆలోచిస్తూ ఉంటాడు.. ఇక తులసి వేసిన ఆఫర్స్ ఇద్దరి ముసలి వాళ్లు తీసుకుంటారు. అయితే వారికి కళ్ళు కనిపించవు.ఇది ఎవరిదో ఇక్కడ పడిపోయింది అని వాళ్లు కూడా అక్కడే పడేసి వెళ్తుండగా అంతలోపు తులసి వెళ్లి ఈ పర్స్ తీసుకోవచ్చు కదా అంటే పరాయి సొమ్ము పాము వంటిది.తాము ముట్టుకోమని చెప్పి వెళ్ళిపోతుండగా ఆ పర్స్తనదేనని చెప్పి తులసి అందులో ఉన్నటువంటి డబ్బులు వాళ్ళకి ఇస్తుంది.

ఈ విధంగా తులసి పేదవారి గురించి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ గురించి కాసేపు సామ్రాట్ కు నీతులు చెబుతుంది.తులసి మాటలు విన్నటువంటి సామ్రాట్ ఇంత మంచి వ్యక్తిని దూరం చేసుకున్నటువంటి నందు నిజంగానే దురదృష్టవంతుడు అని మనసులో అనుకుంటాడు. ఇక నందు సైతం అదే రెస్టారెంట్ కు వెళ్లి తులసికి నా మొహం చూపించాలన్నా కూడా ఏదోలా ఉంది అనుకుంటూ ఉంటాడు అయితే తులసి సామ్రాట్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఒక్కసారిగా గట్టిగా నవ్వుతారు.

ఆ నవ్వు విన్నటువంటి నందు వెనక్కి తిరిగి చూడటంతో అక్కడ సామ్రాట్,తులసి ఉండడం చూసి ఎవరికైతే నా మొహం చూపించకూడదు అనుకున్నానో వాళ్లే ఎదురుపడ్డారు అని తొందరగా అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకుంటాడు.అంతలోనే బిల్ తీసుకురమ్మని చెప్పి మొహం దాచుకుంటూ కౌంటర్ వద్దకు వెళ్లి బిల్ కట్టాలని ప్రయత్నం చేయగా తన పర్స్ లేకపోవడంతో షాక్ అవుతారు.పర్స్ ఇంటి దగ్గరే మరిచిపోయి వచ్చానని చెప్పడంతో హోటల్ యజమాని నందుని చాలా హేళనగా మాట్లాడుతుంటారు. అది చూసిన తులసి సామ్రాట్ ఒక్కసారిగా షాక్ అయి తన బిల్ పే చేస్తారు. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తికాగా తర్వాతి ఎపిసోడ్లో అంకిత శృతి ఇద్దరూ కలిసి లాస్య పై ఎదురుదాడికి దిగుతారు.