ఆవిడ చంపేస్తానని బెరించినా కూడా అల్లు అర్జున్ సీక్రెట్స్ గురించి చెప్పను… అల్లు శిరీష్!

టాలీవుడ్ ఇండస్ట్రీలో అల్లు అల్లు కుటుంబానికి ఉన్న పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు అల్లు రామలింగయ్య వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లు అరవింద్ ఇండస్ట్రీలోనే టాప్ నిర్మాతలలో ఒకరిగా గుర్తింపు పొందారు. అల్లు కుటుంబం నుండి హీరోగా అడుగుపెట్టిన అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ ఇండియా హీరోగా పాపులర్ అయ్యాడు. అల్లు చిన్న కుమారుడు అల్లు శిరీష్ కూడా గౌరవం సినిమా ద్వారా ఇండస్ట్రీలో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే ఆ సినిమా ద్వారా హిట్ అందుకోలేక పోయినా కూడా కొత్తజంట, శ్రీరస్తు శుభమస్తు వంటి సినిమాల ద్వారా హిట్స్ అందుకొని హీరోగా గుర్తింపు పొందాడు.

తాజాగా అల్లు శిరీష్ మరొక కొత్త సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. మూడు సంవత్సరాల తర్వాత” ఊర్వశివో రాక్షసివో” అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకి రానున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని హైదరాబాదులో చాలా ఘనంగా నిర్వహించారు. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అల్లు శిరీష్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలలో టీవీ షో లలో పాల్గొంటూ సందడి చేస్తున్నాడు. ఈ క్రమంలో అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఆలీతో సరదాగా అనే షోలో సందడి చేశాడు.

ఈ షోలో పాల్గొన్న అల్లు శిరీష్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. ఇక ఈ సినిమాలో రొమాంటిక్ సన్నివేశాల గురించి ఆలీ ప్రశ్నించగా ఏం సమాధానం చెప్పాలో తెలియక అల్లు శిరీష్ తల పట్టుకున్నాడు. ఈ క్రమంలో కుటుంబ విషయాల గురించి మాట్లాడుతూ అల్లు అర్జున్ గురించి అడగ్గా..ఇక ‘పుష్ప’ రిలీజ్ సమయానికి తాను ముంబయిలో ఉన్నానని.. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కరూ గొప్పగా మాట్లాడుకుంటుంటే.. తనకు చాలా గొప్పగా అనిపించిందని శిరీష్ వెల్లడించాడు. ఈ క్రమంలో బన్నీ నీకు సీక్రెట్స్ చెప్తాడట కదా అని అలీ అడగ్గా.. శిరీష్ అవునని చెబుతూ.. వదిన నాకు గన్ పెట్టి అడిగినా సరే అవి బయటపెట్టనని సమాధానం ఇచ్చాడు.