శ్రీ సత్య వల్ల బిగ్ బాస్ కి వచ్చాను.. శ్రీ సత్య కోసం రాలేదు.. అర్జున్ కామెంట్స్ వైరల్?

తెలుగు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 6 ప్రసారం అవుతూ ప్రేక్షకులను సందడి చేస్తోంది. ఇలా ఈ కార్యక్రమం ఇప్పటికే 7 వారాలను పూర్తి చేసుకొని ఎనిమిదవ వారం కొనసాగుతోంది. బిగ్ బాస్ హౌస్ లో శ్రీ సత్య అర్జున్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. అయితే శ్రీ సత్యను పడేయటానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తను మాత్రం అర్జున్ వంక కన్నెత్తి కూడా చూడలేదు. అయినప్పటికీ వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ క్రియేట్ చేయడానికి బిగ్ బాస్ ప్రయత్నాలు చేశారు. అయితే ఊహించని విధంగా ఏడవ వారం బిగ్ బాస్ హౌస్ అర్జున్ బయటకు వచ్చారు.

ఈ క్రమంలోనే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి అర్జున్ శ్రీ సత్య గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.తాను బిగ్ బాస్ నుంచి ఎలిమినేట్ అయినప్పుడు శ్రీ సత్య ఎంతో ఎమోషనల్ అయిందంటూ మా ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ వార్తలు వస్తున్నాయి.అదేవిధంగా తాను శ్రీ సత్య కోసమే బిగ్ బాస్ కి వెళ్ళాను అంటూ మరొక వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తాను శ్రీ సత్య కోసం బిగ్ బాస్ హౌస్ కి వెళ్లలేదని ఈ సందర్భంగా అర్జున్ కామెంట్స్ చేశారు.

నాకు సినిమాలంటే చాలా ఇష్టం సినిమాలలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడానికి కష్టపడుతున్నానని అయితే అదే సమయంలో శ్రీ సత్య కలిసి తాను బిగ్ బాస్ కి ట్రై చేస్తున్నాను బిగ్ బాస్ వెళ్లడం వల్ల చాలామందికి రీచ్ కావచ్చు అని చెప్పారు. దాంతో నేను కూడా బిగ్ బాస్ షో కోసం ప్రయత్నాలు చేశానని తెలిపారు.ఇలా శ్రీ సత్య కారణంగా తాను బిగ్ బాస్ హౌస్ కి వచ్చాను కానీ ఆమె కోసమే బిగ్ బాస్ హౌస్ కి రాలేదంటూ ఈ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.