అందరి ముందు శ్రీముఖి పరువు తీసిన హీరో.. అయ్యో అంతమాట అన్నాడేంటి

బుల్లితెర లేడీ యాంకర్లలో శ్రీముఖి కూడా ఒకరు. అదుర్స్ షో ద్వారా యాంకర్ గా పరిచయమైన శ్రీముఖి పటాస్ షో ద్వారా యాంకర్ గా మంచి గుర్తింపు సంపాదించుకుంది. అంతే కాకుండా బుల్లితెర మీద ప్రసారమవుతున్న ఎన్నో టీవీ షోస్ లో యాంకర్ గా వ్యవహరిస్తున్న శ్రీముఖి తన అందంతో పాటు గ్లామర్ తో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. శ్రీముఖి వేసుకొనే పొట్టి బట్టలు వల్ల చాలాసార్లు ఈమె విమర్శలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం శ్రీముఖి జాతి రత్నాలు సరిగమప అనే సింగిల్ షోలో యాంకర్ గా వ్యవహరిస్తుంది.

శ్రీముఖి ఇలా యాంకర్ గా మాత్రమే కాకుండా పలు సినిమాలలో కూడా ప్రధాన పాత్రలలో నటించి నటిగా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. జులాయి, నేను శైలజా వంటి సినిమాలలో ప్రధాన పాత్రలలో నటించిన శ్రీముఖి క్రేజీ అంకుల్స్ అనే సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. అయితే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఇదిలా ఉండగా ఇటీవల అందరి ముందు హీరో నిఖిల్ శ్రీముఖిని అవమానించాడు. ప్రస్తుతం సరిగమప షోలో ఫ్యాన్స్ రౌండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కార్తీకేయ 2 చిత్రం ప్రమోషన్స్ కోసం హీరో నిఖిల్ తాజాగా గా ఈ షో లో పాల్గొన్నాడు. అయితే ఈ షో కి ఎంట్రీ ఇవ్వటంతో నిఖిల్ శ్రీముఖి మీద పంచ్ లు వేసాడు.

ఈ షో లో నిఖిల్ మాట్లాడుతూ..ఈ షో అంటే తన భార్యకి ఎంతో ఇష్టమని, ప్రతీ ఎపిసోడ్ తప్పకుండా చూస్తుందని నిఖిల్ తెలిపాడు. ఆ తర్వాత శ్రీముఖి గురించి మాట్లాడుతూ… ఇంత మంది మంచి మ్యూజిక్ డైరెక్టర్లు, సింగర్లు మధ్య నువ్వెందుకు ఉన్నావు అంటూ అవమానించాడు. నిఖిల్ అలా అనటంతో శ్రీముఖి ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఈ షో లో శ్రీముఖి మీద నిఖిల్ వేసిన కౌంటర్లతో అందరూ పగలబడి నవ్వేశారు. ఇటీవల విడుదలైన ఈ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ప్రేక్షకులని బాగా ఆకట్టుకుంటోంది. ప్రతివారం ఈ షోలో శ్రీముఖి తన అందంతో పాటు అందరిని ఆకట్టుకుంటుంది. అయితే ఈ షో లో శ్రీముఖి ఒక సింగర్ తోలవ్ ట్రాక్ మొదలు పెట్టి బాగా పాపులర్ అయింది ఈ బుల్లితెర రాములమ్మ.