గెటప్ శీను ఆయనతో ఫ్లైట్ జర్నీ చేయగానే యాటిట్యూడ్ చూపిస్తున్నాడు..

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కమెడియన్ గెటప్ శీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వివిధ రకాల గెటప్స్ ద్వారా అందరిని నవ్విస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న గెటప్ శీను ఒకవైపు సినిమాలలో కూడా నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమాలో కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మెగాస్టార్ చిరంజీవి ప్రమోషన్ కార్యక్రమాల కోసం ఎక్కడికి వెళ్లినా గెటప్ శీను కూడా తన వెంటే ఉండే ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.ఈ క్రమంలోనే గాడ్ ఫాదర్ ఈవెంట్ లో భాగంగా నటుడు బ్రహ్మాజీ గెటప్ శీను పై షాకింగ్ కామెంట్ చేశారు. ఈ సందర్భంగా బ్రహ్మాజీ మాట్లాడుతూ గెటప్ శీను ఫ్లైట్లో చిరంజీవి అన్నయ్యతో కలిసి రాగానే యాటిట్యూడ్ చూపిస్తున్నారంటూ కామెంట్ చేశారు. ఇక గెటప్ శీను ఈ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ తన డ్రీమ్ ఫుల్ ఫిల్ అయిందని చెప్పుకొచ్చారు.

ఈ క్రమంలోనే ఈ పోస్టుపై బ్రహ్మాజీ తనదైన స్టైల్ లో సెటైర్లు వేశారు.గెటప్ శీను అన్నయ్యతో కలిసి వస్తున్నట్టు లేదు.. అన్నయ్య ఇతనితో కలిసి వస్తున్నట్టు తెగ ఫీల్ అయ్యాడు. ఈయన ఏకంగా ఫ్లైట్ ఓనర్ అన్నట్టు అన్నయ్యతో పాటు కూర్చుని జర్నీ చేయడమే కాకుండా తన ఆటిట్యూడ్ చూపిస్తున్నారంటూ కామెంట్ చేశారు.అయితే బ్రహ్మాజీ ఇదంతా కూడా సరదాగా అన్నప్పటికీ గెటప్ శీను గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.