బాలకృష్ణకు ఇష్టం లేకపోయినా పవన్ కళ్యాణ్ ను ఆ ప్రశ్న వేశారా… ఈ ప్రశ్నల వెనుక ఉన్నది తనేనా?

నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా ఈయన వ్యాఖ్యాతగా కూడా అభిమానులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ కార్యక్రమం ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుందో మనకు తెలిసిందే. ఇప్పటి మొదటి సీజన్ పూర్తి కాగా రెండవ సీజన్ కూడా చివరి దశకు చేరుకుంది. ఇక రెండవ సీజన్ మాత్రం భారీ స్థాయిలో రేటింగ్స్ కైవసం చేసుకుందని చెప్పాలి. ఈ కార్యక్రమ చివరి ఎపిసోడ్ లో భాగంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కానున్నారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ ప్రోమోలో భాగంగా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఎన్నో రకాల ప్రశ్నలు వేస్తూ తన నుంచి సమాధానాలు రాబట్టే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించడం బాలకృష్ణకు ఇష్టం లేకపోయినా అల్లు అరవింద్ స్క్రిప్ట్ ప్రకారమే ఆయన పవన్ కళ్యాణ్ ను ప్రశ్నించాల్సి వచ్చిందని తెలుస్తోంది.

ముఖ్యంగా బాలకృష్ణ పవన్ ను ప్రశ్నిస్తూ మీ అన్నయ్య చిరంజీవి గారు స్టార్ హీరో ఆయన నుంచి మీరు నేర్చుకున్నది ఏంటి వద్దనుకున్నది ఏంటి అని ప్రశ్నించారు.నిజానికి ఒక స్టార్ హీరో మరొక స్టార్ హీరో గురించి ఇంకొక స్టార్ హీరోని ప్రశ్నించడం భావ్యం కాదు ఇలా తనని ప్రశ్నించడం ఇష్టం లేకపోయినా అల్లు అరవింద్ స్క్రిప్ట్ ప్రకారమే బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ను ఈ ప్రశ్న వేశారని వార్తలు వస్తున్నాయి. మరి ఈ ప్రశ్నకు బాలకృష్ణ ఎలాంటి సమాధానం చెబుతారో వేచి చూడాలి.