సంక్రాంతి సంబరాలకు సిద్ధమైన దీప కుటుంబం…. ప్రాణ త్యాగానికి సిద్ధమైన మోనిత!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే…ఇంద్రుడు చంద్రమ్మ ఇంటికి రావడంతో శౌర్య ఎదురి వెళ్లి ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు బాబాయ్ ఇంటికి అమ్మా నాన్నలు వచ్చారు అని చెప్పడంతో వారిద్దరు షాక్ అయ్యి ఒకరి మొహాలు ఒకరు చూసుకుంటారు. అదేంటి బాబాయ్ అమ్మ నాన్నలు వచ్చారని చెప్పడంతో సంతోషిస్తారు అనుకుంటే ఇలా ఉన్నారని అడగడంతో అది కాదమ్మా హిమకు కనిపించినట్టు నీకు కూడా కనిపించి మాయమయ్యారేమోనని కవర్ చేసుకుంటారు. ఇక ఇంద్రుడు చంద్రమ్మ వెళ్లి దీప కార్తిక్ తో మాట్లాడుతారు. అయితే దీపం మాత్రం ఇంద్రుడితో చాలా చనువుగా మాట్లాడటంతో సౌందర్య అనుమాన పడుతుంది.

ఇంద్రుడు నిజం చెప్పు నీకు దీపా ముందే తెలుసు కదా అనడంతో తనకు తెలియదమ్మా అంటూ అబద్ధం చెబుతాడు. ఇకఇంద్రుడు చంద్రమ్మ వెళ్లిపోతుంటే వాళ్ళని కూడా మనతోపాటు ఉండమని చెప్పండి నాన్నమ్మ అంటూ సౌర్య చెబుతుంది. దీంతో సౌందర్యం మీరు ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు ఇక్కడే అందరు సంక్రాంతి పండుగ చేసుకుందామని అనడంతో హిమ మాత్రం హైదరాబాద్ వెళ్లి సంక్రాంతి జరుపుకుందాం అని అంటుంది.దీప కార్తీక్ ఇక్కడే కనిపించారు కనుక ఇక్కడే సంక్రాంతి జరుపుకుందాం వెంటనే వెళ్లి అన్ని ఏర్పాట్లు చేయండి అని చెబుతుంది.

ఇక హిమాసౌర్య దీపం ముగ్గు వేస్తుండగా అంతలోపే హేమచంద్ర వచ్చి దీపమ్మ ఎప్పుడొచ్చావ్ అంటూ టక్కున నోరు జారుతాడు. అంటే నీకు ముందే తెలుసా అంకుల్ అని అనడంతో హిమ మీ ఫోటో చూపించింది ఇక్కడ ఉన్న వారందరికీ మీరు తెలుసు పోనీలే ఇన్ని రోజుల కైనా వచ్చారని మరోసారి నోరు జారుతారు. దీంతో హేమచంద్ర వ్యవహారంపై కూడా అనుమానపడతారు. ఇక్కడే ఉంటే ఇంకా ఏమేమి నోరు జారుతానో అనుకొని హేమచంద్ర వెళ్ళిపోతాడు. మరోవైపు కార్తీక్ అన్ని విషయాలను తలుచుకొని కారులో ప్రయాణిస్తూ ఉండగా మోనిత మాత్రం కార్తీక్ కారుకు అడ్డుపడి ఆపుతుంది.

నీతో మాట్లాడాలి రా కార్తిక్ అన్న తను రానని చెబుతాడు.ఈ ప్రపంచంలో ఎవరైనా నేను అసహ్యించుకునే వాళ్ళు ఉన్నారు అంటే అది నువ్వేనని కార్తీక్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతాడు కాసేపు పది నిమిషాలు నాతో మాట్లాడి వేల్లు కార్తీక్ అని మోనిత బ్రతిమిలాడిన కార్తీక్ వెల్లడు దీంతో దీప మరికొద్ది రోజులలో చనిపోతుందని నేను ఆంటీకి చెప్పేస్తానని బ్లాక్మెయిల్ చేయడంతో కార్తీక్ వెళ్తాడు.మరోవైపు దీప వంట చేస్తూ ఉండగా చంద్రమ్మ వచ్చి మీరు ఎందుకమ్మా ఇలా వంట చేయడం మీరు పక్కకు తప్పుకోండి అలాగే ఈ టాబ్లెట్స్ వేసుకోమని డాక్టర్ ఇచ్చారు అని చెప్పడంతో ఎలాగో పది రోజుల్లో పోయేదాన్ని ఈ మందులన్నీ అవసరమా నాకు ఉన్న నాలుగు రోజులు పిల్లలకు సంతోషంగా వంట చేసి పెడతాను అని దీప మాట్లాడుతుంది.

మరో వైపు రెస్టారెంట్లో ఉన్నటువంటి మోనిత ఏం తింటావు అని అడగడంతో నన్ను కాల్చుకు తింటున్నావు కదా ఇంకేం కావాలి అని కార్తీక్ కోప్పడతాడు.ఇప్పుడు నాకు నీతో మాట్లాడే ఓపిక కూడా లేదు అని కార్తీక్ అసహ్యించుకోవడంతో దీప చనిపోయిన తర్వాత కూడా నువ్వు నాకు దక్కవని అర్థమైంది కార్తీక్ అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాననీ చెబుతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తిగా తర్వాత ఎపిసోడ్లో దీప కోసం మోనిత తన గుండె దానం చేయడానికి సిద్ధమవుతోంది.