వసుధారపై లేనిపోనివి చెప్పి రిషిని రెచ్చగొట్టిన దేవయాని… జగతి మాటలతో ఆలోచనలో పడ్డ రిషి!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటున్న గుప్పెడంత మనసు సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటుంది మరి నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… దేవయాని అన్న మాటలకు వసుధార ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది.దాంతో దేవయాని నేను ఇప్పటికే సగం విజయం సాధించానని సంబరపడుతూ ధరణిని పిలిచి నేను ఈరోజు చాలా సంతోషంగా ఉన్నాను. నువ్వు ఏం మాట్లాడినా నాకు కోపం రాదు ఈ సంతోషాన్ని సెలెబ్రేట్ చేసుకోవాలి అని మాట్లాడుతుంది. అంతలోనే రీషి కోసం బొకే తీసుకువస్తాడు. పెద్దమ్మ వసుధార ఎక్కడ అని అడగడంతో ఈ ఇంటి నుంచి వెళ్లే వాళ్లందరూ నాకు చెప్పి వెళ్తారా ఏంటి రిషి అని వెటకారంగా సమాధానం చెబుతుంది.

ఏమైంది పెద్దమ్మ అని రిషి అడగడంతో తనని కాలేజీలో ఎవరో ఏదో అన్నారని ఇల్లు వదిలి వెళ్ళిపోయింది. నేను అడుగుతున్న చెప్పలేదు అని దేవయాని రిషిని రెచ్చగొట్టి తనకు అనుకూలంగా మార్చుకుంటుంది. ఇక దేవయాని మాటలతో కోపంగా వెళ్ళిన రిషి ఇల్లు మొత్తం వెతికి జగతి మేడం దగ్గరకు వెళ్తాడు. జగతి దగ్గరకు వెళ్లిన రిషి అసలేం జరిగింది మేడం వసుధార ఎక్కడికి వెళ్లింది తనని ఎవరో ఏదో అన్నారని పెద్దమ్మ చెప్పింది వాళ్ళు ఎవరో చెప్పండి వారి సంగతి చూస్తా అని రిషి చెప్పడంతో ఎంతమందికి సమాధానం చెబుతావు అంటూ జగతి మాట్లాడుతుంది.ఈరోజు ఒకరన్నారని వారిని అంటే రేపు ఇంకొకరు వస్తారు అలా ఎంతమందికి సమాధానం చెబుతావు రిషి అని జగతి మాట్లాడుతుంది. ఇలా జగతి అనడంతో రిషి ఆలోచనలో పడతాడు.

అసలు మగ ఆడ మధ్య సంబంధం గురించి ఎదుటివారికి చెప్పుకోవాల్సిన అవసరం రాకూడదు అలా చెప్పుకుంటూ వెళితే అసలు అది బంధమే కాదు అని జగతి చెప్పడంతో ఒక్కసారిగా రిషి షాక్ అవుతాడు.ఎక్కడైతే తన రక్త సంబంధాన్ని తన తల్లిదండ్రులను వదులుకొని వచ్చిందో అక్కడికే వెళ్లిందని జగతి చెబుతుంది. మరోవైపు వసుధార ఇంటి ఓనర్ కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడటమే కాకుండా తన లగేజ్ మొత్తం బయటకు విసరడంతో వసుధర బాధపడుతూ లగేజ్ మొత్తం తీసుకొని అమ్మవారి దగ్గరకు వెళ్తుంది.

రిషి అక్కడికి వెళ్లి నాకు తెలిసినవి ఇక్కడే ఉంటావని అని చెబుతాడు.అసలేం జరిగింది వసుధార ఇల్లు ఖాళీ చేసావా అని అడగడంతో చేయించారు సర్ అంటూ సమాధానం చెబుతుంది. చాలామంది మాటలతో బాధపెట్టారు ఒక అమ్మాయి అబ్బాయికనిపిస్తే నోటికొచ్చినట్లు మాట్లాడుతారు అంటూ తనకు ఎదురైన సంఘటనలు అన్నింటిని గుర్తు చేసుకుని బాధపడుతుంది.సరే మా ఇంటికి వెళ్దాం రా వసుధారా అని అడగడంతో మీరే మా ఇల్లు అని అంటున్నారు నాకు ఆ ఇంట్లో వారితో ఏంటి సంబంధం? ఏ అర్హతతో ఏ హక్కుతో నేను ఆ ఇంటికి రావాలి. నేను ఆ ఇంటికి వస్తే చాలామందికి ఏవేవో డౌట్స్ వస్తున్నాయి. వాళ్లందరికీ నేను సమాధానం చెప్పాలనుకోవడం లేదు సర్ అందుకే మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అనడంతో రిషి షాక్ అవుతాడు.