రాజీవ్ తో చేతులు కలిపిన దేవయాని…. వసు ఫోన్ స్విచ్ ఆఫ్ అవడంతో కంగారుపడుతున్న జగతి రిషి!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్లో మరింత ఆసక్తికరంగా మారనుంది. నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరుగుతుంది అనే విషయానికి వస్తే… రిషితో ఫోన్ మాట్లాడిన తర్వాత వసుధార బాధపడుతూ కూర్చోగా తన తల్లి సుమిత్ర వచ్చి తనకు ఏవేవో మాటలు చెప్పి బ్రతిమలాడి అన్నం తినిపిస్తుంది. అయితే అదే సమయంలోనే అక్కడికి వచ్చిన చక్రపాణి సుమిత్ర చేతిలోని భోజనం ప్లేట్ లాక్కుంటాడు. అదేదో ఇప్పుడు పని మీద ఇక్కడికి వచ్చింది పని అయిపోగానే వెళ్ళిపోతుంది ఆ తర్వాత మనిద్దరమే ఉండాలి అంటాడు చూసావా అది వచ్చినప్పటి నుంచి ఫోన్లు ఎలా వస్తున్నాయో ఇన్ని రోజులలో ఒక్కసారైనా నీకు ఫోన్ చేసిందా అంటూ ఫోన్ విసిరి కొడతాడు.

అదే సమయంలోనే జగతి వసుధారకు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. దాంతో అక్కడ ఏం జరుగుతుందోనని జగతి టెన్షన్ పడుతూ రిషికి ఫోన్ చేయమని మహేంద్రకు చెబుతుంది.మరోవైపు రిషి వసుధార ఫోన్ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. అసలు వసుధార ఎందుకు నాకు ఫోన్ చేయలేదు అక్కడ ఏం జరుగుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు.వసుధార ఫోన్ స్విచ్ ఆఫ్ రావడం ఏంటి అని ఆలోచిస్తూ ఉండగా అంతలోగా దేవయాని ఫోన్ చేయడంతో వసుదార చెప్పు అంటూ మాట్లాడుతాడు నేను మీ పెద్దమ్మని అని దేవయాని మాట్లాడుతుంది.రిషి ద్వారా అక్కడ పరిస్థితులను తెలుసుకున్నటువంటి దేవయాని నవ్వుకొని ఆ వెంటనే రాజీవ్ కి ఫోన్ చేస్తుంది. నువ్వు రంగంలోకి దిగాల్సిన సమయం ఆసన్నమైంది ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను చెప్పినట్టు చెయ్యి అని రాజీవ్ తో చేతులు కలిపి కుట్రక్ ప్లాన్.

ఫోన్ కట్ చేసిన దేవయాని నేను ఉండగా వసుధార రిషిని ఎలా కలవనిస్తాను కలవనివ్వను అంటూ మాట్లాడుతుంది.ఇక రిషి వసుధార చదువుకున్న కాలేజ్ వద్దకు వెళ్లి అక్కడ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు.చక్రపాణి బయటకు వెళ్తుండగా సుమిత్ర కాఫీ తీసుకువెళ్లిస్తుంది తనకు వద్దని చెబుతాడు అయితే ఆ సమయంలో సుమిత్ర వసుధారతో మాట్లాడొచ్చు కదా అని చెప్పిన చక్రపాణి పట్టించుకోడు. మరో వైపు చూసి వసుధారకు ఫోన్ చేస్తూ ఉంటాడు స్విచ్ ఆఫ్ రావడంతో అక్కడ ఏం జరుగుతుందోనని కంగారు పడతారు ఇలా అయితే లాభం లేదు సరాసరి వస్తారా ఇంటికి వెళ్తానని బయలుదేరుతాడు.

మరోవైపు వసుధార తన తండ్రితో మాట్లాడుతూ..నాకు అహంకారం లేదు చదువుకోవాలని తపన నేను చదువుకోవాలని అనుకున్నాను మీరు పెళ్లి చేయాలనుకున్నారు మాట్లాడుతుండగా తన మాటలకు చక్రపాణి దీర్ఘాలు తీస్తూ వెటకారంగా మాట్లాడుతాడు.బయట నీ కూతురు యూనివర్సిటీ టాపర్గా నిలిచింది అని గర్వంగా చెప్పుకోండి అని చెప్పడంతో ఆయన మాత్రం పరువు పోయింది అంటూ వసుధారను తిడుతూ ఉంటాడు. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తి అవుతుంది.