బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి గుప్పెడంత మనసు సీరియల్ నేడు మరింత ఉత్కంఠ భరితంగా కొనసాగుతుంది. హాస్పిటల్లో జగతికి రక్తం ఇచ్చి తనకు కొడుకుగా సేవలు చేసిన రిషిని చూసి మహేంద్ర వసుధార ఎంతో సంతోషం వ్యక్తం చేస్తారు. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా.. రిషి మహేంద్రను హత్తుకొని ఇకపై తనని విడిచి వెళ్ళకూడదు అంటూ తన డాడీకు చెబుతారు. అదే సమయంలో దేవయాని పనింద్ర అక్కడికి వస్తారు. మహేంద్ర రిషి మాట్లాడుతుండడం చూసి ఓ తండ్రి కొడుకులు కలిసిపోయారు అనమాట అంటూ మనసులో కుళ్ళుకుంటుంది.
మరోవైపు జగతికి స్పృహ రావడంతో మహేంద్ర జగతితో మాట్లాడుతూ తనకు బ్లడ్ ఇచ్చినది రిషి అని చెప్పగా తన కొడుకు తనకు బ్లడ్ ఇచ్చారా అంటూ జగతి ఎంతో సంతోషపడుతుంది. ఈ జన్మకు నాకింత కన్నా ఏం కావాలి మహేంద్ర అంటూ జగతి సంతోషపడుతుంది. అంతలోనే దేవయాని లోపలికి వచ్చి ఏంటి జగతి నీ ఆక్సిడెంట్ ని కూడా నీకు అనుకూలంగా మార్చుకున్నావా అంటూ మాట్లాడుతుంది. దీంతో వసుధార ఆగ్రహం వ్యక్తం చేస్తూ మలుచుకోవడం ఏంటి మేడం మంచిగా మాట్లాడండి.. మేడంకు ఇప్పుడిప్పుడే స్పృహ వస్తోంది అంటూ చెప్పగా తెలుసులే అంటూ వెటకారంగా మాట్లాడుతుంది. ఇలాంటి సమయంలో మీరు ఇలాగే మాట్లాడేది ఇదేనా మీ పెద్దరికం మీ సంస్కారం అంటూ మహేంద్ర దేవయానిపై కోపం వ్యక్తం చేస్తారు.
ఇక ఇది హాస్పిటల్ మహేంద్ర అంటూ జగతి సర్ది చెబుతుంది.రిషి బ్లడ్ ఇచ్చినంత మాత్రాన మీ ఆధీనంలోకి వస్తారా అంటూ దేవయాని మాట్లాడగా.. రిషి జగతి కొడుకు నా కొడుకు ఇకపై మీ పెత్తనాలు చెల్లె రోజులు పోయాయి అంటూ తనకు వార్నింగ్ ఇస్తారు. అంతలోనే రిషి గౌతమ్ ఫణింద్ర లోపలికి రావడంతో జగతిని జాగ్రత్తగా చూసుకో వసుధార అంటూ ప్లేట్ మారుస్తుంది. డాక్టర్ తో మాట్లాడాను ఏం పర్వాలేదు ఇంటికి తీసుకు వెళ్లొచ్చు అని పనింద్ర చెబుతారు. మరోవైపు వసుధార రిషి కోసం హాస్పిటల్ క్యాంటీన్ వద్దకు వెళ్లి టిఫిన్ కోసం వెళుతుంది. రిషి కూడా అక్కడికి వెళ్లి ఇప్పుడు ఎందుకు ఇవన్నీ వసుధారా అనగా మీకు ఇప్పుడు శక్తి కావాలి వెంటనే తినండి అంటూ ఇద్దరు కలిసి టిఫిన్ చేస్తుంటారు.
మరోవైపు గౌతమ్ మహేంద్ర జగతిని తన వద్ద పెట్టుకున్నారని అసహ్యించుకుంటున్నట్టు కలకంటాడు. ఇక రిషి గౌతమ్ వారిని ఇంటికి తీసుకెళ్లడం కోసమే ఏర్పాటు చేస్తుండగా మహేంద్ర జగతి మనసు విప్పి మాట్లాడుకుంటూ ఉంటారు.ప్రతిసారి అన్ని మనం అనుకున్నలా జరగవు నువ్వు రిషి ఇద్దరు చేపనీరు లాంటివారు నీటిని విడిచి చేప ఉండలేదు అంటూ జగతితో మాట్లాడుతూ ఉంటారు. ఇంతటితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.