చంద్రమ్మని చూసి రగిలిపోయిన దీప…. కార్తీక్ కి నిజం చెప్పిన ఇంద్రుడు!

బుల్లితెరపై ప్రసారమవుతున్న కార్తీకదీపం సీరియల్ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంది. ఇక ఈ సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే…శౌర్య కింద పడిపోవడంతో హాస్పిటల్ కి తీసుకు వస్తారు చారుశీల తనకు ట్రీట్మెంట్ చేస్తుండగా కార్తీక్ అని పిలవడంతో ఒక్కసారిగా సౌర్య లేచి మా నాన్న ఇక్కడే ఉన్నారా అంటూ అరవడంతో ఇక్కడ ఎవరూ లేరని చంద్రుడు ఇంద్రమ్మ తనకు సర్ధి చెబుతారు. అయినా పిన్ని బాబాయ్ చెప్పినట్టు వినకుండా ఈ అల్లరి పనులు ఏంటి అని చారుశీల సౌర్యను మందలిస్తుంది.

మరోవైపు కార్తీక్ చాటుగా ఇవన్నీ వింటూ ఇప్పుడు సౌర్యను నేను తీసుకెళ్లి మీ అమ్మ పరిస్థితి ఇది అని చెబితే నువ్వు తట్టుకోలేవు అందుకే అమ్మ నాన్నల కోసం వెతుకుతూ ఇంద్రుడు వాళ్ల దగ్గరే ఉండు అంటూ మనసులో అనుకుంటారు. ఇక ఇంద్రుడు చంద్రమ్మ సౌర్య గురించి మాట్లాడుకుంటూ బాధపడతారు నిజం తెలుసునా కార్తీక్ సార్ ఎందుకు సౌర్యను మన దగ్గరే ఉంచారని ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో దీప హాస్పిటల్ లోకి వచ్చి చంద్రమ్మని చూసి కోపంతో రగిలిపోతుంది. నా బిడ్డ ఎక్కడ అంటూ తనని నిలదీస్తుంది. అంతలోగా ఇంద్రుడితో కార్తీక్ చంద్రమ్మను తీసుకుని వెళ్ళమని చెబుతాడు.

ఈ విధంగా చంద్రమ్మ ఇంద్రుడు వెళ్ళిపోతూ ఉంటే కార్తీక్ వెనకాలే అరుస్తూ పరుగులు పెట్టి కింద పడిపోతుంది. దీంతో కార్తీక్ దీపని తిరిగి ఇంటికి తీసుకెళ్తాడు.మరోవైపు సౌందర్య కార్తీకదీపం కోసం డ్రైవర్ అంజితో కలిసి కారులో ప్రయాణిస్తుంటుంది. హోటల్లో కాసేపు రెస్ట్ తీసుకున్న తర్వాత వారిని వెతకడానికి వెళ్దామని అనుకుంటుంది.ఇన్ని రోజులు లేని నమ్మకం వాళ్ళు బతికున్నారని ఇప్పటికీ నాలో బలంగా కలిగింది. ఒక్క చిన్న క్లూ దొరికిన వారు ఎలాంటి కష్టాల్లో ఉన్న వారిని ఇంటికి తీసుకు వస్తానని మనసులో అనుకుంటుంది.

కొద్దిసేపటికి ఇంద్రుడు చంద్రమ్మ హాస్పిటల్ కి రాగా సౌర్య వాళ్ళ నాన్నమ్మ తాతయ్య దగ్గరకు ఎందుకు వెళ్ళలేదు అసలు తను మీకు ఎలా పరిచయమైందని అడగడంతో అతను యాక్సిడెంట్ అయినప్పటి నుంచి జరిగిన విషయాలన్నింటిని చెబుతాడు. జ్వాలమ్మ రావటం వల్లే చిల్లర దొంగతనాలు చేసే మా బతుకులు మారిపోయాయి.తనకోసమే మేమేం దొంగతనం మాని ఆటో నడుపుకుంటూ బతుకుతున్నాం కానీ మీరు యాక్సిడెంట్లో చనిపోలేదని గట్టిగా నమ్మిన జ్వాలమ్మ తన నానమ్మ వద్దకు వెళ్లలేదు.

ఇలా అంత చెప్పిన తర్వాత మీది ఇంత పెద్ద కుటుంబం ఎందుకు అందరూ ఇలా విడివిడిగా ఉన్నారు అని ఇంద్రుడు ప్రశ్నించగా ఏదైనా ఒక మంచి విషయం చెబితే అందరూ సంతోషపడాలి అలా సంతోషపడే రోజున తప్పకుండా అన్ని విషయాలు మీకు చెబుతాను నా కూతురిని బాగా చూసుకున్నందుకు చాలా థాంక్స్ అంటూ కార్తీక్ రెండు చేతులు జోడించి మొక్కుతారు.ఇక శౌర్య దగ్గరకు వెళ్లి చంద్రమ్మ తాను చదువుకుంటావా అని ప్రశ్నించడంతో తాను అమ్మానాన్నలు దొరికిన తర్వాత వారి దగ్గరికి వెళ్లి చదువుకుంటానని చెబుతుంది. ఇంతటితో ఈ ఎపిసోడ్ పూర్తిగా అవుతుంది.