బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి కార్తీకదీపం సీరియల్ రోజు రోజుకు ఎంతో ఆదరణ సంపాదించుకుంది. ఇక నేటి ఎపిసోడ్లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగింది అనే విషయానికి వస్తే…సౌందర్య శౌర్య వాళ్ళు ఉన్న ఊరికే వెళ్లి అక్కడ ఒక పెద్ద ఇల్లు తీసుకొని చంద్రుడు ఇంద్రమ్మతో పాటు అద్దె ఇంట్లో ఉంటారు. ఇంట్లోకి వెళ్లిన తర్వాత ఇల్లు చూసినటువంటి సౌందర్య ఆనందరావు ఇల్లు చాలా బాగుంది అంటూ అనగా.. సౌర్య మాత్రం తనకు ఇల్లు ఏమాత్రం నచ్చలేదని మాట్లాడుతుంది. ఇంట్లో అమ్మానాన్నలు లేరు నాకు ఆ ఇల్లే నచ్చింది అనడంతో ఆనందరావు సౌర్య పై కోప్పడతాడు.
అమ్మ నాన్న లేని ఇంట్లో ఉన్న కూడా రోడ్డు పక్కన ఉన్నట్టే అనీ శౌర్య అనడంతో ఆ ఇంట్లో ఉన్నవాళ్లే ఇక్కడ ఉన్నారు. నీకేంటి అభ్యంతరమని సౌర్య పై అరుస్తారు. మరోవైపు చారుశీల పండరికి ఫోన్ చేసి దీపకు నేను చెప్పిన టాబ్లెట్ ఇచ్చావా అని అడుగుతుంది. ఇచ్చానమ్మ అని చెప్పడంతో చారుశీల తనలో తానే ఈ టాబ్లెట్స్ అన్ని వాడితే దీప పరలోకానికి వెళ్లిపోతుంది అని నవ్వుకుంటుంది.అంతలోక కార్తీక్ అక్కడికి రావడంతో దీపపై తను అతి ప్రేమ చూపిస్తున్నట్లు నాటకమాడడంతో కార్తీక్ దీప గురించి శ్రద్ధ చూపిస్తున్నందుకు థాంక్స్ అని చెబుతాడు.
ఇక చారుశీల కార్తీక్ తో మాట్లాడుతూ ఎందుకు అలా అబద్దం చెప్పావు దీప దగ్గర అనడంతో తను ప్రాణాలతో ఉండదని చెప్పే ధైర్యం లేక అలా చెప్పాను. అలా చెప్పడం వల్ల దీప నా గురించి మాత్రమే ఆలోచిస్తుందనీ కార్తీక్ అనడంతో ఆలోచించడం కాదు అది ఏకంగా కాటికి పోయే సమయం దగ్గర పడింది అంటూ మనసులో మాట్లాడుకుంటుంది. మరోవైపు దీప కార్తీక్ తో మాట్లాడుతూ మనం శౌర్య వాళ్లకి ఎదురు పడకూడదు కానీ దూరం నుంచి వాళ్ళని చూడొచ్చు కదా ఒకసారి నన్ను తీసుకెళ్లండి అనడంతో కార్తీక్ తనని రాత్రి కారులో తీసుకెళ్తాడు.
సౌర్య చంద్రుడు ఇద్దరు సైకిల్ పై వస్తుండగా తనని చూసిన దీప సంతోష పడినప్పటికీ కార్లలో తిరగాల్సిన మన బిడ్డ ఇలా సైకిల్ పై తిరుగుతుంది మనం తప్పు చేస్తున్నామని ఒకసారిగా కారు దిగి సౌర్య అంటూ పరుగులు పెడుతుంది. కార్తీక్ అడ్డుపడి తన పరిస్థితి గురించి వివరించి తనని వెళ్లకుండా ఆపుతాడు.మరోవైపు శౌర్యకు కార్తీక్ వాళ్ళు కనపడకుండా చంద్రులు అడ్డుపడి ఎమోషనల్ అవుతూ ఉండగా ఎందుకు బాబాయ్ అంతగా ఏడుస్తున్నావు అని సౌర్య అడుగుతుంది. ఏం లేదమ్మా అంటూ సమాధానం చెబుతాడు.
మరోవైపు సౌందర్య హిమతో మాట్లాడుతూ ఇక నువ్వు నీ చదువుపై దృష్టి పెట్టు ఆన్లైన్ క్లాసెస్ కి అటెండ్ కానీ చెబుతుంది.నీతో పాటు ఆ శౌర్యని కూడా చదివించు అనడంతో తను నాతో మాట్లాడటానికి ఇష్టపడటం లేదు ఇక ఏం చదువుకుంటుంది అని హిమ చెబుతుంది. ఎక్కడికి వెళ్ళింది అనడంతో అంతలోపు చంద్రమ్మ వచ్చి తన బాబాయ్ తో కలిసి బయటకు వెళ్ళింది అనగా ఈ టైంలో బయటకు వెళ్లిందా.. అని సౌందర్య మాట్లాడుతూ వారిద్దరు కూడా శౌర్య మొండితనం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.మరోవైపు ఆనందరావు బయట వాకింగ్ చేస్తూ డాక్టర్ హేమచంద్రతో మాట్లాడతారు మీరు ఏం చేస్తుంటారు అనడంతో హేమచంద్ర తాను ఒక డాక్టర్ అని పరిచయం చేసుకుంటారు.