తల్లిదండ్రుల కోసం హిమ ఆరాటం చూసి బాధపడిన దీపా కార్తీక్…. అంజి పండరీ కొడుకుని తెలుసుకున్న దీప!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్ లో భాగంగా ఏం జరిగింది అనే విషయాన్ని వస్తే…దీప దోసకాయ పచ్చడి చేస్తూ ఉంటుంది అంతలోపే డాక్టర్ బాబా అక్కడికి వెళ్లి ఏం చేస్తున్నావు అనడంతో నేను ఉన్నన్ని రోజులు చాలా సంతోషంగా ఉండి చనిపోతాను ఇకపై తాను బాధపడనని చెప్పడంతో కార్తీక్ సంతోష పడతాడు. అయితే పేస్ట్ అయిపోవడంతో ఇదివరకు పేస్ట్ అయిపోతే ఏం చేసేవారు అలాగే చేసి ఇప్పుడు బ్రష్ చేయండి అని చెబుతోంది.అలా కార్తీక్ బెస్ట్ బ్రష్ తీసుకొని బయటకు రావడంతో అక్కడ సౌందర్య వాళ్ళని చూసి షాక్ అవుతాడు వెంటనే బయట తాళం వేసి పక్కకు వెళ్లిపోతాడు.

ఇక అంజి సౌందర్య అక్కడికి వచ్చి తాళం వేసి ఉండడం చూసి బాధతో వెళ్లిపోతారు అయితే దీప అక్కడికి వచ్చి ఎందుకు తాళం వేశారు అని చెప్పడంతో కాసేపు ఉంటే అమ్మ వాళ్లకు దొరికిపోయే వాళ్ళం వాళ్ళు ఇక్కడికే వచ్చారు అని కార్తీక్ చెబుతాడు. అదేవిధంగా అంజి మరెవరో కాదని పండరి కొడుకు అని చెప్పడంతో దీపా షాక్ అవుతుంది.ఒకరోజు పండరిని నిలదీయడంతో తన ఫోటో చూపించిందని అయితే తాను చేసిన తప్పులు వల్ల తనని దూరంగా ఉంటుందని కార్తీక్ తెలియచేశారు అయితే ఇప్పుడు అంచి మారిపోయాడు కదా ఆ విషయం చెప్పచ్చు కదా అనడంతో అంజి గురించి మనం పండరీకి చెబితే మమ్మీ వాళ్ళకు మన గురించి తెలుస్తుంది అని కార్తీక్ చెబుతాడు.

 

మరోవైపు హేమచంద్రకు దీప దోశలు వేస్తూ ఉంటుంది దీప మాట్లాడుతూ ఎలాగైనా అత్తయ్యను ఒకసారి ఇక్కడికి పిలుచుకురండి అన్నయ్య నేను తనతో మాట్లాడాలి నేను ఎలాగో మరి కొద్ది రోజులలో చనిపోతాను అప్పుడు ఆయన అత్తయ్య వాళ్ళ దగ్గరకు వెళ్ళమని చెప్పినా వినకుండా ఉన్నారు తనతో మాట్లాడాలి అనడంతో హేమచంద్ర సరేనని చెబుతాడు. అయితే అంతలోపు కార్తీక్ వచ్చి దీపానికి ఎన్ని సార్లు చెప్పాలి నువ్వు లేకుండా నేను లేను ఎక్కడికి వెళ్లినా ఇద్దరం కలిసి వెళ్తామని మరోసారి సీరియస్ అవుతాడు. అంతలోపే హిమ అక్కడికి రావడంతో దీపా కార్తిక్ దాక్కుంటారు. అంకుల్ మీరు సౌర్య అమ్మానాన్నలను వెతకడానికి వెళ్తున్నారట కదా నేను కూడా మీతో పాటే వస్తాను అని చెబుతుంది.

దీంతో హేమచంద్ర సరేనా అని చెప్పి హిమను దోసలు తినడానికి తీసుకువెళ్తాడు దోసకాయ పచ్చడి దోస తింటూ తన తల్లిని గుర్తు చేసుకుని ఏడుస్తుంది. అది చూసిన దీపా కార్తీక్ ఎంతో బాధపడతారు.ఇక హిమ అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో చూసావా హేమచంద్ర ఎందుకు మేం దూరంగా ఉన్నాము అని చెప్పడంతో హేమచంద్ర కూడా సరే మీరు ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండండి అని చెబుతాడు. ఇక సౌందర్య అంజి అన్ని ఇల్లు వెతుకుతూ ఉన్నప్పటికీ వారికి మాత్రం దీప కార్తీక్ కనిపించకపోవడంతో నిరాశ చెందుతారు.