భాగ్యం ఇంటికి చేరిన దీప కార్తిక్… దీప గురించి నిజం తెలుసుకున్న సౌందర్య!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నటువంటి కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్లో భాగంగా ఏం జరిగిందనే విషయాన్ని వస్తే.. దీప మోనిత గురించి ఆలోచిస్తూ దీని పీడ ఎలా విరగడవుతుంది దీనివల్ల ఇంట్లో ఎవరికి మనశ్శాంతి లేకుండా పోతుందని బాధపడుతూ ఉంటుంది.నేను చనిపోయిన కూడా ఇది డాక్టర్ బాబును వదిలిపెట్టదు చాలా ఓవర్ చేస్తుంది మరీ రెచ్చిపోతే నేను నా గురించి అత్తయ్యకు నిజం చెప్పేస్తాను అనుకుంటుంది.నేను ఈ విషయం అత్తయ్య గారికి చెప్పేదే మంచిది. నేను ఎలాగో పోతాను కదా పోయేటప్పుడు దాన్ని కూడా వెంట తీసుకపోతే డాక్టర్ బాబు పిల్లలు సంతోషంగా ఉంటారు అని ఆలోచిస్తుంది.

 

అప్పుడే పిల్లలు అక్కడికి వచ్చి ఏంటమ్మా నీకు మా దగ్గరికి రావడం ఇష్టం లేదా ఎందుకు అలా ఉన్నావు అని అడగడంతో అదేం లేదు అంటూ దీప సమాధానం చెప్పగా సౌందర్య అక్కడికి వచ్చి నీవాళకం చూస్తుంటే అలాగే ఉంది. నీకు ఇక్కడికి రావడం ఇష్టం లేదేమో అనుకుంటూ మాట్లాడుతుంది.ఇక సౌందర్య అక్కడికి రావడంతో దీప నువ్వేదో నాకు నిజం చెప్తాను అన్నావు కదా అనడంతో మామయ్య గారిని చూడాలని ఉంది అని అబద్ధం చెబుతుంది అలాగే స్టవ్ మీద పాలు పెట్టానని అక్కడి నుంచి తప్పించుకుంటుంది కానీ సౌందర్య మాత్రం వీరీ ప్రవర్తనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉంటుంది.

ఇక సంక్రాంతి పండుగ సందర్భంగా ఇంట్లో అందరూ కూర్చొని పూజ చేసుకుంటూ ఉంటారు. ఈ సంతోషం ఇలాగే ఉండిపోవాలి అనే సౌందర్య అనడంతో తప్పకుండా ఉంటుంది అని దీప సమాధానం చెబుతుంది. అందరూ సంతోషంగా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో చూసావు కదా డాక్టర్ బాబు మనం నిజం చెప్పకపోవడం వల్ల వీరందరూ ఎంతో సంతోషంగా ఉన్నారనీ దీప మాట్లాడుతుంది. మరి నువ్వు ఎందుకు ఎప్పటికీ సంతోషం ఇలాగే ఉంటుందని మాట ఇచ్చావు అనడంతో అదంతా మీ చేతుల్లోనే ఉంది డాక్టర్ బాబు అంటుంది. డాక్టర్ ను రెండో పెళ్లి చేసుకోమని సలహా ఇవ్వగా కార్తీక్ కోప్పడతాడు. ఇక వీరందరూ డాన్స్ చేస్తూ ఉండగా మోనిత అక్కడికి వస్తుంది.

తనని చూసిన దీప కళ్ళు తిరిగి పడిపోవడంతో అందరూ కంగారుపడతారు. మరోవైపు దీప తండ్రి దీప కార్తీక్ ఫోటోలను చూస్తూ ఏడుస్తూ కూర్చుంటాడు అప్పుడే భాగ్యం వచ్చి ఇలా ఎన్ని రోజులని వాళ్ళ ఫోటోలు చూస్తూ ఏడుస్తారు వాళ్ళు లేని బాధ నుంచి నేను కూడా బయటపడలేకపోతున్నాను అంటూ తన భర్తకు కాఫీ ఇస్తుంది. అంతలోపే దీప కార్తీక్ వాళ్ళు అక్కడికి వెళ్లి డోర్ కొట్టడంతో భాగ్యం వాళ్ళని చూసి ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోతుంది అయితే దీప తండ్రి దీప కార్తిక్ ని చూసి ఎంతో సంతోషపడతారు. ఇక భాగ్యం లేచిన తర్వాత దీప కార్తిక్ ని చూసి ఆమె కూడా సంతోషపడుతుంది.

ఇక ఎప్పటికీ సంతోషం ఇలాగే ఉండాలి దేవుడా అనిసౌందర్య మొక్కుకొని ఈ సంతోషం ఇలాగే ఉంటే తిరుపతికి వస్తాను అని దేవుని ప్రార్థిస్తుంది. అంతలోపే
మోనిత కూడా అక్కడికి వెళ్లడంతో సౌందర్య కోప్పడుతుంది. ఇలా సౌందర్య తనపై కోప్పడడంతో కాసేపు ప్రశాంతంగా వినండి ఆంటీ ఇక్కడకు వచ్చిన మీ కొడుకు కోడలు అలాగే పైకి వెళ్ళిపోతే ఏం చేస్తారు అనడంతో సౌందర్య మోనిత పై మండి పడగా ఈ ఆవేశమే తగ్గించుకోండి ఆంటీ అంటూ దీప రిపోర్ట్స్ కి సంబంధించిన ఫైల్ సౌందర్య చేతిలో పెడుతుంది. అయితే ఆ ఫైల్ చూసినటువంటి సౌందర్య దీప పరిస్థితి తెలుసుకొని షాక్ అవుతుంది.