కామెడీ స్టార్స్ షో ప్రసారం నిలిపివేత… మరి ఆ కమెడియన్ల పరిస్థితి ఏంటి..?

బుల్లితెర మీద ప్రసారమవుతున్న కామెడీ షోలలో నంబర్ వన్ అనగానే మొదటగా గుర్తొచ్చేది జబర్దస్త్ కామెడీ షో. ఈ కామెడీ షోకి గీటుగా బుల్లితెర మీద ఎన్నో కామెడీ షోలు ప్రసారం అయ్యాయి. కానీ జబర్థస్త్ షో కి దీటుగా ఏ కామెడీ షో కూడా నిలబడలేకపోయాయి. జబర్దస్త్ కామెడీ షోకి పోటీగా స్టార్ మా చానల్ వారు కామెడీ స్టార్ట్స్ అనే సరికొత్త కామెడీ షో ని ప్రారంభించారు. ఈ క్రమంలో అధిక రెమ్యూనరేషన్ ఆశ చూపించి జబర్దస్త్ కమెడియన్లని స్టార్ మా ఛానల్ వారు తమ వైపు తిప్పుకున్నారు. జబర్దస్త్ ద్వారా కమెడియన్లుగా గుర్తింపు పొందిన ఎంతోమంది అధిక రెమ్యూనరేషన్ కి ఆశపడి జబర్దస్త్ కి స్వస్తి చెప్పారు.

ఆ తర్వాత మా టీవీలో ప్రసారమైన కామెడీ స్టార్స్ షోలో కొంతకాలం ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నాలు చేశారు. కానీ జబర్దస్త్ కామెడీ షోకి దీటుగా కామెడీ స్టార్స్ రేటింగ్స్ సాధించలేకపోయింది. దీంతో ఈ కామెడీ స్టార్స్ షో ప్రారంభించిన కొంతకాలానికే నిర్వాహకులకు నష్టాలు తెచ్చిపెట్టింది. ఇలా నష్టాలతో నడుస్తున్న ఈ కామెడీ షో ని మా టీవీ వారు ప్రసారం చేయటానికి ఆసక్తి చూపలేదు. దీంతో ఈ షో ప్రారంభించిన కొంతకాలానికి ప్రసారం నిలిపివేశారు. అయితే అధిక రెమ్యూనరేషన్ కి ఆశపడి జబర్దస్త్ ని వదిలి కామెడీ స్టార్స్ కోసం వెళ్ళిన వారి పరిస్థితి ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది.

ఒకసారి మల్లెమాల వారితో ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత వేరే ఛానల్ లో పనిచేయడానికి వీలులేదు. అలాగే మల్లెమాల వారితో కుదుర్చుకున్న ఒప్పందం పూర్తయి ఆ సంస్థ నుండి బయటకు వచ్చినవారికి మళ్లీ తిరిగి మల్లెమాల సంస్థలో ప్రవేశం ఉండదు. ఇలా జబర్దస్త్ కి దూరమైన ఎంతోమంది ఇప్పుడు అవకాశాలు లేక ఖాళీగా ఉంటూ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ క్రమంలో ఓంకార్ సలహా మేరకు ఆహా యాజమాన్యం వారు కామెడీ స్టాక్ ఎక్సేంజ్ పేరుతో సరికొత్త కామెడీ షో ప్రారంభించనున్నారు. ఓంకార్ ని నమ్ముకొని జబర్ధస్త్ కి దూరమైన వారికి ఈ షో ద్వారా మళ్ళీ అవకాశం కల్పిస్తున్నట్లు తెలుస్తోంది.