జగతిని తప్పుగా అర్థం చేసుకున్న కాలేజ్ స్టాఫ్… జగతి పై మరో కుట్రకు ప్లాన్ చేసిన దేవయాని!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొని రోజురోజుకు ఎంతో మంచి ఆదరణ సంపాదించుకుంటున్న గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయాన్ని వస్తే… జగతి వసు చెప్పిన విషయాలన్నింటినీ కూడా మహేంద్రకు చెప్పి బాధపడటమే కాకుండా తనని తన ఇంటికి వెళ్ళమని చెప్పానని చెబుతుంది.అలా చేస్తే ఎలా జగతి వసుదారా ఒకసారి వెళ్ళిపోతే మరి తిరిగి ఇక్కడికి రాగలదా అని చెప్పగా తను అక్కడికి వెళ్లాలి మహేంద్ర వెళ్లి తిరిగి మళ్ళీ ఇంటికి రావాలి వాళ్ళిద్దరూ కలిసి అధికారకంగా ఈ ఇంట్లో ఉండాలి అంటే ఏం చేయాలో ముందు అది ఆలోచించు. వాళ్ళిద్దరిని మూడుముళ్ల బంధంతో ఒకటి చేయాలి ముందు అది ఆలోచించు అంటూ జగతి మహేంద్రకు సలహా ఇస్తుంది.

మరుసటి రోజు కాలేజీలో రిషి మీటింగ్ అరేంజ్ చేస్తారు. మిషన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్ కు మంచి ఆదరణ వస్తుందని ఈ ప్రాజెక్టు గురించి అందరూ ఎంతో గొప్పగా చెబుతున్నారని మీటింగ్లో మాట్లాడతారు ఇక ఫణీంద్ర కూడా తాను రెండు రాష్ట్రాల ఎడ్యుకేషన్ మినిస్టర్ లతో కలిసి మాట్లాడాను వారి నెంబర్ నీకు ఇస్తాను వెంటనే ఇందుకు సంబంధించిన విషయాలన్నింటినీ మెయిల్ చేయమని వసుదారకు చెబితే సరే సరే అని చెబుతుంది.ఇక వసుధరా అక్కడి నుంచి వెళ్లడంతో ఇద్దరు కాలేజీ స్టాప్స్ జగతి గురించి తప్పుగా అర్థం చేసుకోవడంతో వారిద్దరిని ఆపి వసుధర క్లాస్ తీసుకుంటుంది.

ఇక పనింద్ర మహేంద్ర రిషి ముగ్గురు కూర్చుని మాట్లాడుతూ మహేంద్ర ఆరోగ్యం గురించి తనకు జాగ్రత్తలు చెబుతారు. అంతలోపే ఇంటి నుంచి భోజనం రావడంతో వసుధారణ కూడా రమ్మని చెబుతాడు. వాళ్లు ముగ్గురు మహేంద్ర ఆరోగ్యం గురించి మాట్లాడుతూ ఉండగా వసుధార మాత్రం కాలేజీ స్టాఫ్ అన్నమాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. అంతలోపే రిషి ఏంటి మూడ్ ఆఫ్ లో ఉన్నావు అని అడగా కాలేజీ స్టాప్ చెప్పిన విషయాలన్నింటినీ సార్ కి చెబితే బాధపడతారు వద్దులే అనుకుంటుంది.

నేనిక్కడున్నానని మీకు ఎలా తెలిసింది సార్ అంటూ వసుధార అనగా నువ్వు ఏ మూడ్లో ఉన్నప్పుడు ఎక్కడ ఉంటావు నాకు కాకుండా ఎవరికి తెలుస్తుంది వసుధారా అంటూ వీరిద్దరూ తరగతి గదిలో వారి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఉంటారు.అసలు విషయాన్ని పసిగట్టిన రిషి ఎప్పుడు కూడా ఎదుటివారి విషయాలను పట్టించుకోకుండా నువ్వు పర్ఫెక్ట్ గా ఉంటే చాలు అని తనకు ధైర్యం చెబుతాడు. మరోవైపు జగతిని చూడడం కోసం ఇద్దరు కాలేజ్ ఆఫ్ రావడంతో వారికి జగతి పట్ల ప్రేమ ఉన్నట్లు దేవయాని నటిస్తూ పలకరిస్తుంది అదే సమయంలో వాళ్ళిద్దరూ వస్దార గురించి చెడుగా మాట్లాడుకోవడం విన్న దేవయాని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది.

ఇకపోతే అదే సమయంలో ధరిని వాళ్లకు కాఫీ తీసుకురావడమే కాకుండా వంటగదిలో చాటుగా నిలబడి వాళ్లేం మాట్లాడుతున్నారో వింటుంది. కాలేజ్ స్టాఫ్ ఇద్దరు కూడా దేవయానిని పొగుడుతూ ఉండడంతో దేవయాని సంతోషపడుతుంది.ఇక దేవయాని ధరణిని పిలిచి వాళ్ళిద్దరిని జగతి రూమ్ కి తీసుకెళ్లమని చెబుతుంది అయితే తీసుకెళ్లేటప్పుడు ఒకసారి నన్ను కలవమని చెప్పి పైకి వెళ్తుంది ఇలా కాలేజి స్టాప్ ద్వారా మరోసారి దేవయాని జగతి వసు పై పెద్ద కుట్రకు ప్లాన్ చేస్తుంది.