మా మధ్య గొడవలు లేవని నిరూపించుకోవడానికి ప్రతిసారి అలా చేయలేం: అల్లు అరవింద్

ప్రముఖ నటుడు అల్లు రామలింగయ్య వారసుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అల్లు అరవింద్ నటుడిగా తన సత్తా నిరూపించుకోలేకపోయినా కూడా నిర్మాతగా మారి ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించి ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ ప్రొడ్యూసర్ గా గుర్తింపు పొందాడు. ఇలా సినిమా రంగంలో మంచి గుర్తింపు పొందిన అల్లు వారి కుటుంబానికి మెగా కుటుంబంతో గొడవలు ఉన్నాయని చాలా కాలంగా ఇండస్ట్రీలో రూమర్లు వినిపిస్తున్నాయి.

అయితే ఈ రూమర్ల గురించి అటు అల్లు ఫ్యామిలీ, ఇటు మెగా ఫ్యామిలీ స్పందించకపోవడంతో ఈ వార్తల్లో నిజముందని ప్రజలు కూడా నమ్ముతున్నారు. ఇదిలా ఉండగా ఇటీవల ఒక టీవీ షోలో పాల్గొన్న అల్లు అరవింద్ ఈ రూమర్ల గురించి స్పందిస్తూ క్లారిటీ ఇచ్చాడు. ఈటీవీలో ప్రసారం అవుతున్న ఆలీతో సరదాగా అనే షోలో పాల్గొన్న అల్లు అరవింద్ మెగా కుటుంబంతో ఉన్న గొడవల గురించి స్పందిస్తూ.. 1980 నుండి మేమిద్దరం చాలా క్లోజ్ గా కలిసి పెరిగాం అంటూ చెప్పుకొచ్చాడు.

ఇక పిల్లలు కూడ ఇండస్ట్రీలో గుర్తింపు కోసం పోటీ పడటం సహజమే. కానీ కుటుంబ సభ్యుల మధ్య ఎటువంటి విభేదాలు లేవు. మా కుటుంబాల మధ్య ఎటువంటి గొడవలు లేవని నిరూపించుకోవడానికి మేము కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలు ప్రతిసారి సోషల్ మీడియాలో షేర్ చేయడం కరెక్ట్ కాదు కదా” అంటూ అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చారు.