బిగ్ బాస్ 11 వ వారం నామినేషన్లు… ఆ ఒక్కరు సేఫ్..?

బిగ్ బాస్ సీజన్ సిక్స్ రోజురోజుకి చాలా రసవత్తరంగా కొనసాగుతోంది. కొంతకాలంగా బిగ్ బాస్ హౌస్ లో జరుగుతున్న నామినేషన్ల పరంపర ఎలిమినేషన్ ప్రక్రియను ఆసక్తికరంగా ఉంటూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఇటీవల జరిగిన పదవ వారం ఎలిమినేషన్స్ తో ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. మొదటినుండి బాలాదిత్య ఎలిమినేట్ అవుతాడని వార్తలు వినిపిస్తున్నప్పటికీ చివర్లో డబుల్ ఎలిమినేషన్ అంటూ బిగ్ బాస్ అందరికీ షాక్ ఇచ్చాడు. ఇక ఈ పదవ వారంలో ఇంట్లో స్ట్రాంగ్ కంటెంట్ గా ఉన్న బాలాజీత్తోపాటు బ్యూటీ క్వీన్ వాసంతి కూడా ఎలిమినేట్ అయ్యింది. వాసంతి ఎలిమినేషన్ అసలు ఎవరు ఊహించలేదు.

ఇక ఈ పదవ వారంలో ఎలిమినేషన్ పూర్తయి ప్రస్తుతం 11 వ వారంలో కొనసాగుతోంది. ఇక ఈ పదకొండవ వారంలో కూడా ఎప్పటిలాగే నామినేషన్ ప్రక్రియ చాలా ఆసక్తికరంగా మారింది ఇటీవల ఈ వారానికి సంబంధించిన నామినేషన్ ప్రక్రియ పూర్తి అయ్యింది. మొత్తం 21 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ బిగ్ బాస్ సీజన్ సిక్స్ ఇప్పటికే 10 వారాలు పూర్తి చేసుకొని మొత్తం 11 మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో కేవలం పది మంది కంటెస్టెంట్లు మాత్రమే ఉన్నారు. రోజురోజుకీ వీరి ఆటతీరులో మార్పు రావడంతో ఓటింగ్ విషయంలో కూడా మార్పులు జరుగుతున్నాయి. అందువల్ల టాప్ ఫైవ్ లో కొనసాగే వారిని గెస్ చేయడం కూడా కష్టంగా మారిపోయింది.

ఇక ప్రస్తుతం కొనసాగుతున్న ఈ వారంలో మొత్తం పది మంది కంటెస్టెంట్లలో 9 మంది నామినేట్ అయ్యారు. ఇక ఈ వారంలో ఫైమా కెప్టెన్ గా ఉండటం వల్ల నామినేషన్ నుండి తప్పించుకుంది. ఈ సీజన్ దాదాపు పూర్తయ్యే దశకు చేరుకుంది. ఇప్పటికే ఈ సీజన్ 70 రోజులు 71 ఎపిసోడ్ లు పూర్తి చేసుకుంది. ఇక కేవలం 20 రోజులు మాత్రమే మిగిలాయి. ప్రస్తుతం 11వ వారంలో కొనసాగుతున్న బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో ఇప్పుడు నామినేట్ అయిన 9 మందిలో ఎవరు ఎలిమినేట్ అవుతారని చాలా ఆసక్తికరంగా ఉంది. ఎందుకంటే గత కొన్ని వారాలుగా బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రేక్షకుల అంచనాలకు అందకుండా ఉంటుంది.