పడి లేచిన కెరటం.. బిగ్ బాస్ సీజన్ 8 రన్నరప్ గౌతమ్ కృష్ణ!

మొత్తానికి బిగ్ బాస్ సీజన్ 8 విన్నర్ ఎవరో తెలిసిపోయింది. 105 రోజులు పాటు ఆడియన్స్ ని అలరించిన బిగ్బాస్ సీజన్ 8 ఆదివారం గ్రాండ్ గా ముగిసింది. చీఫ్ గెస్ట్ గా రామ్ చరణ్ వచ్చాడు. కన్నడ నటుడు నిఖిల్ ఈ సీజన్ విన్నర్ గా నిలబడ్డాడు. గౌతమ్ కృష్ణ రన్నరప్ గా మిగిలిపోయాడు. అయితే గౌతమ్ కృష్ణ నిఖిల్ కి గట్టి పోటీని ఇచ్చాడు.

చివరి నిమిషం వరకు కూడా. ఎవరు విన్ అవుతారా అని ఉత్కంఠతతోనే ఎపిసోడ్ కొనసాగింది. చివరికి నిఖిల్ విన్ అయ్యాడని తెలిసినప్పటికీ చాలా తక్కువ ఓట్లు తేడాతో గౌతమ్ విన్నర్ ప్లేస్ ని వదులుకోవాల్సి వచ్చింది. అయినా కూడా గౌతమ్ కృష్ణ అందరి హృదయాలని గెలుచుకున్నాడు. సీజన్ సెవెన్ లో అతను సంపాదించుకున్న నెగెటివిటీ అంతా సీజన్ 8లో పాజిటివ్ గా మారి అతనిని బిగ్ బాస్ రన్నరప్ గా నిలబెట్టింది.

వైల్డ్ కార్డుతో వచ్చి వైల్డ్ ఫైర్ అయ్యాడు గౌతమ్ పడి లేచిన కెరటం లా మాటలు పడిన చోటే జీరో నుంచి హీరోగా మారాడు. ఎలిమినేషన్ నుంచి విన్నింగ్ రేస్ లోకి వచ్చి రన్నర్ అయ్యాడు. నిజానికి ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో వైల్డ్ కార్డు ద్వారా వచ్చే రన్నరప్ అయిన కంటెస్టెంట్స్ ఎవరూ లేరు. ఆ విధంగా గౌతమ్ కృష్ణ రికార్డు క్రియేట్ చేశాడని చెప్పాలి. బిగ్ బాస్ లో ఉన్నందుకు వారానికి రూ.1.75 లక్షల చొప్పున గౌతమ్ కృష్ణ ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది.

ఈ లెక్కన 10 వారాలకు గానూ సుమారు రూ.17.5 లక్షల రెమ్యునరేషన్ గౌతమ్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇక గౌతమ్ కెరియర్ విషయానికి వస్తే ఆకాశవీధుల్లో సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అవ్వడమే కాకుండా ఆ సినిమాకి డైరెక్షన్ కూడా చేశాడు. ప్రస్తుతం సోలో బాయ్ సినిమాతో అతను ఆడియన్స్ ముందుకి రాబోతున్నాడు. ఇక పర్సనల్ విషయానికి వస్తే అతను యాక్టర్ మాత్రమే కాదు డాక్టర్ కూడా.