బిగ్ బాస్ సీజన్ 7 కి హోస్ట్ గా తప్పుకున్న నాగార్జున… ఆ స్థానంలో మరొక స్టార్ హీరో?

దేశవ్యాప్తంగా నంబర్ వన్ రియాలిటీ షో గా గుర్తింపు పొందిన బిగ్ బాస్ రియాలిటీ షో అన్ని భాషలతో పాటు తెలుగులో కూడా ప్రసారమవుతున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగులో ఇప్పటికే ఆరు టెలివిజన్ సీజన్లు ఒక నాన్ స్టాప్ సీజన్ పూర్తి చేసుకుంది. తాజాగా బిగ్ బాస్ సీజన్ సిక్స్ కూడా పూర్తి అయింది. ఈ బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో రేవంత్ టైటిల్ విన్నర్ గా నిలువగా శ్రీహాన్ రన్నర్ గా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ సిక్స్ పూర్తి అవ్వటంతో బిగ్ బాస్ సీజన్ 7 గురించిన అప్డేట్ గురించి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 7 గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

బిగ్ బాస్ మొదటి సీజన్ కి హీరో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత రెండవ సీజన్లో హీరో నాని హోస్ట్ గా ఆకట్టుకున్నాడు. ఇక బిగ్ బాస్ మూడవ సీజన్ నుండి ఇటీవల పూర్తి అయిన ఆరవ సీజన్ దాకా నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరిస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. దీంతో బిగ్ బాస్ ఏడవ సీజన్ లో కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహరించాలని బుల్లితెర అభిమానులు కోరుకుంటున్నారు. అయితే నాగార్జున మాత్రం ఇకపై బిగ్ బాస్ ఏడవ సీజన్ లో హోస్ట్ గా వ్యవహరించడానికి నాగార్జున ఆసక్తి చూపటం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో నాగార్జున స్థానంలో ఎవరు ఆ ప్లేస్ రీప్లేస్ చేస్తారు అని ప్రేక్షకులలో ప్రశ్న మొదలైంది.

ఈ తరుణంలో బిగ్ బాస్ షోలో హోస్ట్ గా నాగార్జున స్థానంలో మరొక స్టార్ హీరో సందడి చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ హీరో మరెవరో కాదు దగ్గుబాటి రానా. విరాటపర్వం సినిమా తర్వాత రానా ఒక్క సినిమాలో కూడా నటించడం లేదు. అనారోగ్య కారణాలవల్ల రానా కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా అనారోగ్యం వల్ల సినిమాలకు దూరంగా ఉండటంవల్ల అభిమానులకు తనకి మధ్య చాలా గ్యాప్ వస్తుందన్న ఉద్దేశంతో రానా బిగ్ బాస్ ఏడవ సీజన్ లో హోస్ట్ గా వ్యవహరించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ వార్తల్లో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే కొంతకాలం ఎదురు చూడాలి.