తండ్రిగా ప్రమోషన్ పొందిన బిగ్ బాస్ సామ్రాట్… వైరల్ అవుతున్న ఫోటో?

బుల్లి తెరపై ప్రసారమవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో ద్వారా ఎంతోమంది మంచి గుర్తింపు పొందారు. ఇలా బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన వారిలో సామ్రాట్ కూడా ఒకరు. మోడల్ గా మంచి గుర్తింపు పొందిన సామ్రాట్ ఎన్నో సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించాడు. అయినప్పటికీ సామ్రాట్ కి సినిమాల ద్వారా సరైన గుర్తింపు లభించలేదు. ఈ క్రమంలో బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్న సామ్రాట్ ఈ షో ద్వార మంచి గుర్తింపు పొందాడు. బిగ్ బాస్ హౌజ్ లో సామ్రాట్ ఆట తీరు అందరిని బాగా ఆకట్టుకుంది. కానీ టైటిల్ మాత్రం దక్కించుకోలేకపోయడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో వుండగానే సామ్రాట్ విడాకుల వార్తలు హల్ చల్ చేశాయి.

మొదట 2015 లో హర్షితా రెడ్డి అనే యువతిని వివాహం చేసుకున్న సామ్రాట్ కొంతకాలం తర్వాత వారిద్దరి మధ్య వచ్చిన మనస్పర్తల వల్ల 2018లో విడాకులు తీసుకుని ఒకరికొకరు దూరమయ్యారు. కొంతకాలం ఒంటరిగా ఉన్న సామ్రాట్ 2020లో కరోనా లాక్ డౌన్ సమయంలో కాకినాడలో శ్రీ లిఖిత అనే యువతని పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నాడు. సామ్రాట్ భార్య శ్రీ లిఖిత సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. భర్తతో కలిసి ఫోటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది. అయితే కొంతకాలం క్రితం సోషల్ మీడియా ద్వారా తను తండ్రి కాబోతున్న విషయాన్ని సామ్రాట్ వెల్లడించాడు.

తాజాగా ఆగష్టు 15 వ తేదీన ఇండిపెండెన్స్ డే సందర్భంగా తనకి కూతురు పుట్టిన విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ఈ క్రమంలో సామ్రాట్ తన కూతుర్ని ఎత్తుకొని ముద్దు పెడుతున్న ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఇండిపెండెన్స్ డే రోజున నా కూతురితో ఇలా సెలబ్రేట్ చేసుకోవడం చాలా ప్రత్యేకంగా ఉంది అంటూ రాసుకొచ్చాడు. సామ్రాట్ షేర్ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సందర్భంగా పలువురు సెలబ్రిటీలతో పాటు అభిమానులు కూడా సామ్రాట్ కి అభినందనలు తెలియజేస్తున్నారు.