భలే ఛాన్సు కొట్టేసిన బిగ్‌బాస్ పులి

బిగ్‌బాస్ హౌస్‌‌కి పెద్ద దిక్కుగా, తనని తాను పులిగా అభివర్ణించుకున్న నటరాజ్ మాస్టర్, అనూహ్యంగా అతి తక్కువ సమయంలోనే హౌస్ నుండి బయటికి వచ్చేసిన సంగతి తెలిసిందే. హౌస్ నుండి బయటికి వచ్చిన నటరాజ్ మాస్టర్ ఓ స్పెషల్ ఛాన్స్ కొట్టేశాడు.

ఆహా ఓటీటీ ఛానెల్ కోసం బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ అనే టాక్ షోకి హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో ఈ షో ప్రారంభం కానుంది. భారీ అంచనాల నడుమ మొదలవుతున్న ఈ షో ప్రమోషన్స్ కూడా ఓ రేంజ్‌లో చేస్తున్నారు ఆహా వారు.

అందులో భాగంగానే, ఓ ప్రమోషనల్ సాంగ్‌ని ప్లాన్ చేశారట. ఆ సాంగ్‌లో బాలయ్య ఊర మాస్ స్టెప్పులతో అలరించనున్నారట. ఆ సాంగ్ కొరియోగ్రఫీ చేసే అరుదైన ఛాన్స్ నటరాజ్ మాస్టర్‌కి దక్కింది. దొరికిన ఈ అపురూపమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా నటరాజ్ మాస్టర్, అద్ధిరిపోయే స్టెప్పులు కంపోజ్ చేశారట బాలయ్య కోసం.

ఇప్పుడీ సాంగ్ హాట్ టాపిక్ అయ్యింది. త్వరలోనే ఈ సాంగ్ రిలీజ్ చేయనున్నారు. చూడాలి మరి, నటరాజ్ మాస్టర్ కంపోజేషన్‌లో బాలయ్య వేసిన స్టెప్పులు ఏ రేంజ్‌లో ఉండబోతున్నాయో.