Bigg Boss 5 Telugu: సెంచరీ కొట్టిన బిగ్ బాస్.. టైటిల్ పై కన్నేసిన సన్నీ

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 తెలుగు మొత్తానికి సెంచరీ కొట్టింది. టాప్ 5 సంబంధించిన కంటెస్టెంట్లని నిన్నటి సండే ఎపిసోడ్ లో కింగ్ నాగార్జున రివీల్ చేసారు. కాజల్ ఎలిమినేట్ అవ్వడంతో సిరి, షణ్ముఖ్, సన్నీ, మానస్, శ్రీరామ్ చంద్రలు గ్రాండ్ ఫినాలేకి చాలా గ్రాండ్ గా ఎంటరయ్యారు. అయితే.. ఐదు రోజులే మిగిలి ఉండటంతో కంటెస్టెంట్స్ కి హైప్ ఇచ్చేలాగా ఎపిసోడ్స్ ని రూపుదిద్దుతున్నారు బిగ్ బాస్ నిర్వాహకులు.

ఈ నేపథ్యం లో నిన్న జరిగిన 100 ఎపిసోడ్ లో మానస్ – సన్నీల మధ్య ఒక సంభాషణ జరిగింది. ‘టెన్షన్ గా ఉంది రా.. టైటిల్ ఎలాగైనా గెలవాలి.. అమ్మకి మాట ఇచ్చి వచ్చినా.. అమ్మకి కప్ ఇస్తా రా బయ్ .. నేను ఫిక్స్, ఏదైనా చేస్తా.. బరాబర్ చేస్తా అని మానస్ ముందు సన్నీ ధీమా వ్యక్తం చేసాడు. టెన్షన్ ఏం పడకురా అని మానస్ సన్నీకి ధైర్యం చెప్పాడు. ఈ ఎపిసోడ్ చూసిన ప్రతి ప్రేక్షకుడు సన్నీదే టైటిల్ అంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం చేస్తున్నారు.