నాగార్జున సర్వ సాధారణంగా అంత వాయిస్ పెంచడు. పదాలు కూడా అంత పరుషంగా ఏమీ ఉండదు. గత సీజన్లో కూడా ఎన్నడూ కూడా పదాలను హద్దు దాటకుండానే వాడాడు. కంటెస్టెంట్లను హెచ్చరించినా కూడా సుతిమెత్తగా మందలించాడు. ఈ నాల్డో సీజన్లోనూ అదే చేస్తూ వచ్చాడు. అయితే ఐదో వారంలో జరిగిన సంఘటనలకు మాత్రం నాగార్జున బాగానే హర్ట్ అయ్యాడు. అందుకే ఒక్కొక్కరి తాట తీశాడు.
నామినేషన్ ప్రక్రియలో ఒక్కొక్కరు ఏ రేంజ్‌లో అరుచుకున్నారో, విరుచుకుపడ్డారో అందరికీ తెలిసిందే. అభిజిల్ అఖిల్ సోహెల్ దివి ఇలా అందరూ తమ గొంతును పెంచి రెచ్చిపోయారు. ఇక సోహెల్ మాత్రం హద్దు దాటి ఏం మాట్లాడుతున్నాడో కూడా సోయి లేనంతగా రెచ్చిపోయాడు. అటు దివి మీదకు ఇటు అభిజిత్ మీదకు మాటల యుద్దాన్ని తీసుకొచ్చాడు. ఇక ఇదే విషయంపై నాగ్ మందలించాడు.
నామినేషన్ ప్రక్రియలో ఆ అరుపులేంటి? నరాలు కూడా బయటకు కనిపిస్తున్నాయి.. అలా అరవడం చూడటానికి కూడా బాగాలేదు. అయినా అమ్మాయి మీద అలా అరవడం ఏంటి పిచ్చికుక్కలా అరిచావ్ ఇంకోసారి అలా చేయకని సూచించాడు. నువ్ అదొక్కటి మార్చుకుంటే ఎక్కడికో వెళ్లిపోతావ్.. ఆట బాగానే ఆడావ్.. కెప్టెన్ అయ్యావ్ అంటూ చివరగా మళ్లీ తేనె పూసి కూల్ చేసేశాడు.