బిగ్ బాస్ షో అంటే కేవలం టాస్కులు చించుకుంటూ ఆడటం కాదు. టాస్కులు ఆడటం, నవ్వించడమే అయితే అది బిగ్ బాస్ షో ఎలా అవుతుంది. బిగ్ బాస్ షో అంటే ఓ మనిషిని పరీక్షించడం. రెచ్చగొడితే ఎలా మారతాడు.. కోపం వస్తే ఎలా ప్రవర్తిస్తాడు.. తాను గెలవడం కోసం ఎదుటివారిని మోసం చేయాల్సి వస్తే ఎలాంటి దారులను ఎంచుకుంటాడు ఇలా ఎన్నో రకాలుగా పరీక్షించేదే బిగ్ బాస్.
అందుకే బాడీ ఉంది కదా అని తెగ విర్రవీగిపోయిన మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. దసరా రోజున దివి ఎలిమినేట్ అయితే.. దీపావళి సందర్భంగా మెహబూబ్ ఎలిమినేట్ అయ్యాడు. ఈ మేరకు లీకులు తెగ వైరల్అవుతున్నాయి. మెహబూబ్ ఎలిమినేట్ అయినట్టు నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి ఇన్నాళ్లకు తమ కల నిజమైందని సంబరపడుతున్నారు.
మామూలుగా అయితే రోబో టాస్కులో మెహబూబ్ చేసిన ఓవర్ యాక్షన్‌కు మూడో వారంలోనే ఎలిమినేట్ అయ్యాడు. ఈ మేరకు లీకులు కూడా వచ్చాయి. కానీ చివరి క్షణంలో దేవీ నాగవల్లిని బలి చేశారు. మరోసారి సోహెల్ కాపాడాడు.కానీ ఈ సారి మాత్రం ఎవ్వరూ రక్షించలేకపోయారు. మెహబూబ్ ఎలిమినేట్ అయినట్టు వస్తోన్న లీకుల్లో ఎంత నిజముందో తెలియాలంటే ఆదివారం ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు ఆగాల్సిందే.