Home TV SHOWS అవినాష్ జీవితాన్ని నాశనం చేసిన సుజాత.. స్టేజ్ మీదనే ఆ మాట అనేసింది!!

అవినాష్ జీవితాన్ని నాశనం చేసిన సుజాత.. స్టేజ్ మీదనే ఆ మాట అనేసింది!!

బిగ్‌బాస్ షోలో ఎంట్రీ ఇచ్చిన క్షణం నుంచి అవినాష్ ఓ మాట చెబుతున్నాడు. తనకు బయట సంబంధాలు చూస్తున్నారు నన్ను వదిలేయండి సర్ అంటూ నాగార్జునను వేడుకుంటున్నారు. ప్రతీ వీకెండ్‌లో నాగార్జున రావడంతో ఏమీ లేకపోయినా సరే అరియానా-అవినాష్ మధ్య ఏదో ఉందని క్రియేట్ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాడు. సర్లే ఇలాగైనా ఫేమస్ అవుదామని అనుకున్నారో ఏమో గానీ వారు మరింత దగ్గరయ్యారు.

Bigg Boss 4 Telugu Sujatha Angry On Avinash Marriage
Bigg Boss 4 Telugu Sujatha Angry On Avinash Marriage

అయితే మామూలుగానే అవినాష్ ఇంట్లో ఉన్న లేడీస్ అందర్నీ ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. అందరితో సరదాగానే ఉంటాడు. వచ్చీ రాగానే మోనాల్‌తో పులిహోర కలిపాడు. ఆపై దివికి లైన్ వేశాడు. ఇక సుజాతతోనూ చాలా క్లోజ్‌గానే ఉండేవాడు. స్వాతి దీక్షిత్‌తోనూ అంతే సన్నిహితంగా ఉన్నాడు. ఇక ప్రస్తుతం మాత్రం ఆరియానాతో ట్రాక్ ఓ రేంజ్‌లో దూసుకుపోతోంది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. నిన్న సుజాత ఎలిమినేట్ అయిన తరువాత బయటకు వచ్చి అవినాష్ జీవితంలో నిప్పులు పోసింది.

Bigg Boss 4 Telugu Sujatha Angry On Avinash Marriage
Bigg Boss 4 Telugu Sujatha Angry On Avinash Marriage

లోపల వీరిద్దరి మధ్య ఏం జరిగిందో ఏమో గానీ బయటకు వచ్చిన సుజాత.. ‘నీకు పెళ్లి ఎలా అవుతుందో నేను చూస్తాను. అసలు నీకు పెళ్లే కాకుండా చూస్తాను’ అంటూ దారుణంగా మాట్లాడింది. అయితే అవినాష్ మాట్లాడే మాటలతో సుజాత ఏమైనా నిజంగా ప్రేమను ఫీల్ అయినట్టుంది. కానీ అందరితో అంతే క్లోజ్‌గా ఉండటం ఆమెకు నచ్చలేదేమో. సుజాత అలాంటి మాటలు మాట్లాడే సరికి అవినాష్ ఒక్కసారిగా షాక్ అయ్యాడు. దానికి తోడు నాగార్జున కూడా.. పిల్లనిచ్చే అత్తలు ఇది చూడండి సుజాత ఇలా అంటోంది అంటూ అగ్గిలో ఆజ్యం పోశాడు. మరి సుజాత ఆ మాటలు ఎందుకు అనాల్సి వచ్చిందో క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.

- Advertisement -

Related Posts

రోబో దర్శకుడితో చరణ్, పవన్.. వామ్మో.. ఇదెక్కడి కాంబో!

ఒక మల్టీస్టారర్ సినిమా సెట్స్ పైకి వచ్చే వరకు ఒకప్పుడు అభిమానులు నమ్మేవారు కాదు. అయితే చాలా కాలం తరువాత అగ్ర హీరోలు ఈగోలను పక్కనపెట్టే సినిమాలను వెండితెరపైకి తీసుకు వస్తున్నారు. ఇక...

స్టార్ హీరో పెళ్లి వేడుక.. మాజీ లవ్ బర్డ్స్ కు స్పెషల్ ఇన్విటేషన్

బాలీవుడ్ లో త్వరలో ఒక యువ హీరో పెళ్లి చేసుకోబోతున్న విషయం తెలిసిందే. బ్యాక్ టూ బ్యాక్ కమర్షియల్ హిందీ సినిమాలతో బాక్సాఫీస్ వద్ద సాలీడ్ హిట్స్ అందుకుంటున్న వరుణ్ ధావన్ త్వరలో...

నేను చస్తే వాటికి ఆహారం అవుతాను.. కమెడియన్ వింత కోరిక

సాధారణంగా ఎవరైనా సరే చనిపోతే అవయవదానం చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. మరికొందరు ఉన్నతమైన వారు తన శరీరం జూనియర్ డాక్టర్స్ కు ఉపయోగపడాలని ఏకంగా బాడీని మెడికల్ కాలేజ్ కోర్సుల కోసం...

డిజాస్టర్ టాక్ వచ్చినా డోస్ తగ్గలేదు.. మాస్టర్ కు అప్పుడే అన్ని కోట్లా?

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ ఎలాంటి సినిమా చేసినా కూడా బాక్సాఫీస్ వద్ద మినిమమ్ 100కోట్లకు తక్కువగా రాబట్టవు. కథలో మ్యాటర్ లేకపోయినా కూడా విజయ్ క్యారెక్టర్ ను సరిగ్గా ఎలివేట్ చేస్తే...

Latest News