బిగ్ బాస్ నాల్గో సీజన్‌లో 55 రోజులు గడిచిపోయాయి. ఎనిమిది వారాల్లో ఎనిమిది ఎలిమినేషన్లు జరిగిపోయాయి. గంగవ్వ, నోయల్‌కు ఆరోగ్యం బాగా లేక ఇంటి నుంచి నిష్క్రమించారు. మొత్తంగా తొమ్మిది మంది బయటకు వెళ్లినట్టు. ఇప్పుడు ఇంట్లో పది మంది మిగిలారు. మామూలుగా అయితే నోయల్ ఆరోగ్యం బాగా లేకపోవడంతో బయటకు వెళ్లాల్సి వచ్చింది. ఇక మళ్లీ తిరిగి వచ్చే అవకాశం లేనందుకు అది ఎలిమినేష్ కిందే పరిగణించారు.
అలా ఎనిమిదో వారంలో నోయల్ నామినేషన్స్‌లో లేకపోయినా ఎలిమినేట్ కావాల్సి వచ్చింది. అయితే నోయల్ ఎలిమినేషన్‌తో నామినేషన్‌లో ఉన్నవారంతా సేవ్ అయినట్టు తెలుస్తోంది. ఈ వారం మరో ఎలిమినేషన్ ఉండదని తెలుస్తోంది. అంటే ఇంట్లో మొత్తంగా పది మంది ఉంటారు. ఒకవేళ నేటి ఎపిసోడ్‌లో కూడా మరో ఎలిమినేషన్ జరిగితే.. తొమ్మిది మంది ఉంటారు. మరీ చూడాలి ఏం జరుగుతుందో.
ఇలాంటి సమయంలో కొందరు పనిలేని వాళ్లు కొత్త కొత్త రూమర్లు పుట్టిస్తారు. సింగర్ మంగ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తుందని వార్తలు రాసేస్తున్నారు. అసలు మంగ్లీ తనకున్న పాపులార్టీతో ఇలా మధ్యలో వచ్చేందుకు ఒప్పుకోదు. మామూలుగానే ఎప్పటి నుంచో మంగ్లీని అడుగుతున్నా కూడా ఆమె రావడం లేదు. పైగా ఇలా సగం షో అయ్యాక వచ్చి.. మధ్యలో వెళ్లిపోవడానికి ఎవ్వరూ ఇష్టపడరు. అయినా ప్రస్తుతం మంగ్లీ సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్, సింగర్‌గా ఇలా ఫుల్ బిజీగా ఉంది. మంగ్లీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అన్నది దాదాపు ఫేక్ న్యూసే. కానీ అది బిగ్ బాస్ షో. ఎప్పుడు ఎలా ఎందుకు జరుగుతుందో ఎవ్వరం చెప్పలేం.