అందరి ముందు నరేష్ పరువు తీసిన బామ్మ.. డైపర్లు కావాలంటే నన్ను అడుగు అంటూ?

జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ లాగే శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కొంతకాలం క్రితం ప్రారంభించిన ఈ షోలో జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కమెడియన్లతోపాటు పలువురు టీవీ ఆర్టిస్టులు కూడా ఈ షోలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు. ప్రతివారం ఒక భిన్నమైన థీమ్ తో శ్రీదేవి డ్రామా కంపెనీ ప్రేక్షకుల ముందుకి వస్తోంది. ఈ షోలో హైపర్ ఆది రాంప్రసాద్ కామెడీ తో పాటు రష్మీ యాంకరింగ్ కూడా ఈ షో ని వేరే లెవెల్ కి తీసుకెళ్తుంది. ఇక ఈ షోలో ఇంద్రజ గారు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ షో మొదలైన నాటినుండి జడ్జ్ గా వ్యవహరిస్తున్న ఇంద్రజ కొంతకాలం ఈ షో కి బ్రేక్ ఇచ్చింది. ఈవారం ప్రసారం కాబోయే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్ లో ఇంద్రజ మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.

శ్రీదేవి డ్రామా కంపెనీ షో లో “బోనాల జాతర ” పేరుతో ఈ వారం స్పెషల్ ఎపిసోడ్ ని ప్రసారం చేయనున్నారు. ఇక ఈ ఎపిసోడ్లో ఎప్పటిలాగే ఆది, రాంప్రసాద్ తమ పంచులతో అదరగొట్టారు. ఈ వారం ప్రసారం కాబోయే ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో ఇటీవల రిలీజ్ చేశారు. ఈ ఎపిసోడ్లో కార్తికేయ 2 సినిమా టీం సందడి చేసింది. ఈ క్రమంలో హీరో నిఖిల్ హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఈ షోలో సందడి చేశారు. ఈ ఎపిసోడ్లో అనుపమ పరమేశ్వరన్ తన మధురమైన గాత్రంతో పాట పాడి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక ఒక సందర్భంలో నిఖిల్ మాట్లాడుతూ.. ఇలాంటి జాతరలో నా మరదలు తప్పిపోయింది అని అనగా.. మా బావ కూడా తప్పిపోయాడు అని అనుపమ అంటుంది. దీంతో ఇమాన్యుల్ వెంటనే స్టేజి మీదకి వచ్చి దొండకాయ బెండకాయ అనుపమ నా గుండె కాయ అంటూ డైలాగ్ చెప్తూ నేనే నీ బావని అంటూ వచ్చాడు.

ఇక ఈ వారం ప్రసారం కాబోయే ఈ ఎపిసోడ్ లో జానపద గీతాలు పాడే ఒక బామ్మ కూడా పాల్గొని. దీంతో పొట్టి నరేశ్ మాట్లాడుతూ.. ” బామ్మా నీకు ఫన్ కావాలన్నా, కామెడీ కావాలన్నా నన్ను అడుగు” అంటాడు . “నీకు డైపర్లు కావాలంటే నన్నడుగు” అంటూ కౌంటర్ డైలాగ్ వేసి ఆ భామ్మ అందరిముందు నరేశ్ పరువు తీసింది. తర్వాత ఒక సందర్భంలో రష్మీ ఆది వద్దకు వచ్చి బామ్మతో కలిసి చేసినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు అని అడగ్గా? ఆది బామ్మ చేయి పట్టుకొని షేక్ హ్యాండ్ ఇస్తు కళ్ళు ఎగరేసాడు. అయితే భామ్మా కూడా ఏ మాత్రం తగ్గకుండా ఆమె కూడా కళ్ళు ఎగరేస్తూ నాలుక కొరుకుతూ ఆది వార్నింగ్ ఇచ్చింది. మొత్తానికి ఈ వారం ప్రసారం కాబోయే శ్రీదేవీ డ్రామా కంపెనీ షో ప్రేక్షకులని బాగా అలరించనుంది.