ఒకే వేదికపై కలవనున్న బాలయ్య – పవన్ కళ్యాణ్..? ఇక ఫ్యాన్స్ కి పునకాలే…!

సాధారణంగా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు ఇద్దరు కలిసి ఒక చోట కనిపిస్తే ప్రేక్షకులు ఎంత సందడి చేస్తారో అందరికీ తెలిసిందే. అలాంటిది కొందరు స్టార్ హీరోల రేర్ కాంబినేషన్ కనిపిస్తే ఇక ప్రేక్షకుల అందానికి అవధులు ఉండవు. టాలివుడ్ లో ఇలాంటి రేర్ కాంబినేషన్స్ లో బాలకృష్ణ – జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ ఇలా ఇద్దరు స్టార్ హీరోలు కలిసి ఒకే వేదికపై కనిపిస్తే ప్రేక్షకుల హంగామా ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె షో పుణ్యమా అని స్టార్ హీరోలు జోడిగా కనిపించారు. ఈ క్రమంలో మహేష్ బాబు – బాలకృష్ణ కలిసి కనిపించడంతో ఈ షో కి రికార్డ్ స్థాయిలో రేటింగ్స్ వచ్చాయి.

ఇక అన్ స్టాప్ అబుల్ సీజన్ 2 కూడా తొందరలోనే ప్రారంభం కానుంది. ఇక ఈ షో కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టాలెంటెడ్ డైరెక్టర్ త్రివిక్రమ్ హాజరు కానున్నట్లు సమాచారం. ఇక ఈ షో కి బాలకృష్ణ
హోస్టుగా వ్యవహరించనున్నాడు. ఇక ఈ షో కి పవన్ కళ్యాణ్ ని గెస్ట్ గా తీసుకురావడానికి అల్లు అరవింద్ చాలా కష్టపడినట్లు తెలుస్తోంది. ఎట్టకేలకు పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ఈ షో కి హాజరుకానున్నారు. ఇక ఈ షోలో బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ వంటి ఇద్దరూ స్టార్ హీరోలు ఒకే స్టేజి మీద కనిపించనున్నారు. ఈ వార్త తెలిసినప్పటినుంచీ ఈ ఇద్దరి హీరోల అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఈ షో లో బాలకృష్ణ పవన్ కళ్యాణ్ సినిమా ,రాజకీయ విశేషాలకు సంబంధించిన ప్రశ్నలతో పాటు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విశాల గురించి కూడా ప్రశ్నలు సందించే అవకాశం ఉంది. అయితే నిజంగానే బాలయ్య షోకి పవన్ కళ్యాణ్ హాజరవుతాడా? అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అన్ స్టాపుల్ షో ప్రారంభం కానంతవరకు బాలకృష్ణ ఇలాంటి షోలలో కనిపించిన దాఖలాలు లేవు. కానీ అల్లు అరవింద్ మేనేజ్ చేయటం వల్ల బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. అలాంటిది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ఈ షో కి తీసుకురావటం అల్లు అరవింద్ కి పెద్ద పనేమీ కాదని కొందరు తమ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే.