అరెస్ట్ అయిన మోనిత… వంటలక్క సేవలో డాక్టర్ బాబు!

బుల్లితెర ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న కార్తీకదీపం సీరియల్ నేటి ఎపిసోడ్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… నేటి ఎపిసోడ్లో భాగంగా సౌందర్య ఇంటి నుంచి తప్పించుకొని వచ్చిన మోనితను చూసిన శివలత ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు మేడం అంటూ మాట్లాడుతుంది. అప్పుడు మోనిత కార్తీక్ వంటలక్క వచ్చారా అని అడగగా లేదు అని శివలత సమాధానం చెబుతుంది. నాకు చెప్పకుండా కార్తీక్ ఎక్కడికి వెళ్ళడు అలాంటిది ఎక్కడికి వెళ్ళాడు ఆ వంటలక్క చేయి పట్టుకొని ఎటు వెళ్లిపోయారు కొంపతీసి కార్తీక్ గతం గుర్తొచ్చిందా అనుకుంటూ శివలత ఫోన్ నుంచి కార్తీక్ కి ఫోన్ చేస్తుంది. కార్తీక్ ఫోన్ లిఫ్ట్ చేయడు.

ఇక వెంటనే మోనితబట్టల సర్దుకొని రివాల్వర్ తీసుకొని బయలుదేరుతూ ఉండగా వెంటనే సౌందర్య అక్కడికి వచ్చి నాకు తెలుసు నువ్వు ఇక్కడికే వచ్చింటావని. ఇంకా ఎవరిని చంపుదామని అనుకుంటున్నావు అని సౌందర్య అనగా ముందు మిమ్మల్ని చంపి మరెవరినైనా చంపుతా మొన్న వదిలేసి తప్పు చేశాను. అయినా మీరెందుకు నా వెంట పడుతున్నారు అంటూ మోనిత గన్ చూపిస్తూ సౌందర్యకు వార్నింగ్ ఇస్తుంది. దీంతో సౌందర్య పక్కకు తప్పుకోవడంతో ఎనక ఏసిపి ఉండడం చూసి ఒక్కసారిగా మోనిత షాక్ అవుతుంది.

ఈ క్రమంలోనే పోలీస్ ఆఫీసర్ మాట్లాడుతూ అసలు బేయిల్ పై ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నావు అసలు ఈ బోటిక్ ఏంటి ఏం చేస్తున్నావు అంటూ తనని ప్రశ్నిస్తుంది.ఇలా రివాల్వర్ చూపించి బెదిరిస్తున్నావు. ఈ ఒక్క నేరం చాలు నువ్వు 10 సంవత్సరాలు బయటకు రాకుండా ఉండడానికి అంటూ తనని అరెస్టు చేస్తుంది. ఇక మోనిత పోలీస్ జీప్ ఎక్కుతూ కూడా సౌందర్యకు వార్నింగ్ ఇస్తుంది. మరోవైపు కార్తీక్ దీప సేవలో నిమగ్నమై ఉంటాడు. తనని మెల్లిగా నడిపిస్తూ ఉన్నప్పుడు దీప భార్యలకు బాగా లేనప్పుడే భర్తల ప్రేమ బయటపడుతుందా అని ప్రశ్నిస్తుంది.

ఆ సమయంలో డాక్టర్ బాబు సమాధానం చెబుతూ ఇది బాధ్యత అంటాడు.ఇది అందరి విషయంలోనేమో కానీ నా విషయంలో కాదు డాక్టర్ బాబు అంటూ ఎమోషనల్ అవుతుంది. ఇలా దీపను నడిపిస్తూ ఉండగా కార్తీక్ ఒకసారి తాను మోనిత వద్దకు వెళ్లి వస్తానని చెబుతాడు.వద్దని దీప చెబుతున్నప్పటికీ ఆయన తను నన్నేం చేస్తుంది. నాకు గతం గుర్తు రాలేదని చెబుతాను ఒకవేళ నమ్మకపోతే గతం గుర్తొచ్చిందని చెబుతా నన్నేం చేయలేదు కదా అని అని చెబుతాడు.అది మిమ్మల్ని వదలదు డాక్టర్ బాబు పెద్ద జిడ్డు మీరు అక్కడికి వెళ్తే మరి ఇక్కడికి పంపించదు అంటూ దీప చెబుతున్న వినకుండా డాక్టర్ బాబు వెళ్తాడు.

మరోవైపు సౌందర్య కూరగాయలు కట్ చేస్తూ మోనిత గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో కార్తీక్ వాళ్ళ గురించి మాట్లాడుతూ తన అరెస్టు గురించి ఆనందరావుకు చెబుతుంది. మోనిత ప్లాన్ చూస్తుంటే పిచ్చి పడుతుంది అందుకే ఇలా కూరగాయలు కట్ చేస్తున్నాను అంటూ సౌందర్య సమాధానం చెబుతుంది. ఇక కార్తీక్ వెళ్లడంతో దీపా ఒంటరిగా కూర్చుంటుంది. అంతలోపు డాక్టర్ వచ్చి మరోసారి కార్తీక్ ను కూతుర్ని వెతకమని దీప పంపించిందా అసలు వీళ్ళిద్దరి మధ్య ఏం జరుగుతుంది అని తెలుసుకోవడానికి అక్కడికి వెళుతుంది. ఇక కార్తీక్ ఇంటికి వెళ్ళగానే శివలత జరిగినది మొత్తం చెప్పడంతో కార్తీక్ ఆలోచనలో పడతాడు.