గట్టిగానే ఇచ్చుకున్నట్టున్నారు.. అనసూయ ‘పక్కా లోకల్’ మ్యాజిక్

అనసూయ అందంలోనూ, నటనలోనూ, డ్యాన్సుల్లోనూ తనకు తానే పోటీ అన్న సంగతి తెలిసిందే. అనసూయ స్టెప్పులేస్తే అది బుల్లితెరైనా, వెండితెరైనా షేక్ అవ్వాల్సిందే. అదే మరి అనసూయకు ఉండే క్రేజ్ అంటే. వెండితెరపై ఐటెం సాంగ్ చేసినా కూడా ఓ పద్దతిలో చేసే అనసూయ.. తాజాగా బుల్లితెరపై తన అందాలను ఆరోబోసింది. మత్తెక్కించే స్టెప్పులతో అందరికీ పిచ్చెక్కించేస్తోంది. జీ తెలుగు దసరా ఈవెంట్‌లో అనసూయ రచ్చ మామూలుగా లేనట్టుంది.

Anasuya Pakka Local Dance Performance In Zee Telugu Dasara Event,Anasuya

ఈ దసరాకు బుల్లితెరపై అసలైన పండుగ వాతావరణం రాబోతోంది. ప్రతీ చానెల్‌లో ఓ స్పెషల్ ఈవెంట్ ఉంది. ఈ టీవీలో అక్కా ఎవరే అతగాడు, స్టార్ మాలో జాతరో జాతర జీ తెలుగులో చి ప్రదీప్ చిలసౌ శ్రీముఖి అనే ఓ స్పెషల్ ఈవెంట్ చేస్తున్నారు. ఇందులో ప్రదీప్, శ్రీముఖి హైలెట్ అవుతుండగా.. అనసూయ, జానీ మాస్టర్‌లు స్పెషల్ అట్రాక్షన్ కాబోతోన్నారు. ఇక నాగబాబు, నిహారికలు ఎలాగూ వారి వారి స్టైల్లో అదరగొడతారు.

Anasuya Pakka Local Dance Performance In Zee Telugu Dasara Event,Anasuya

అయితే ఈ ఈవెంట్‌లో మాత్రం అందరికీ బాగానే ఇచ్చుకున్నట్టున్నారు. రెమ్యూనరేషన్‌ భారీగానే ఇవ్వడంతో జానీ మాస్టర్ లేడీ గెటప్ వేశాడనే టాక్ వస్తోంది. ఇక ఆ రేంజ్‌లో ఇచ్చారు కాబట్టే అనసూయ కూడా ఐటెం సాంగ్‌తో రెచ్చిపోయిందని అంటున్నారు. మొత్తానికి పక్కా లోకల్ అంటూ మాయ చేసేందుకు అనసూయ వచ్చింది. అనసూయ వేసిన మాస్ స్టెప్పులు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి. అనసూయ మీద వచ్చిన ప్రోమో తాజాగా వైరల్ అవుతోంది.

https://www.instagram.com/p/CGsSnCCpjzM/