పవన్ కల్యాణ్ తో మరొక హీరోని పోల్చిన ఆది.. దేనితో కొట్టాలంటూ ఏకిపారేస్తున్న పవన్ ఫ్యాన్స్ …?

జబర్థస్త్ ద్వార గుర్తింపు పొందిన ఆది గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వృత్తిరీత్యా సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన ఆది జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన పంచ్ లతో బాగా ఫేమస్ అయ్యాడు. జబర్థస్త్ లో ఉన్న సీనియర్ ఆర్టిస్టులను వెనక్కి నెట్టి తాను మొదటి వరుసలోకి వచ్చాడు. జబర్దస్త్ ద్వారా వచ్చిన పాపులారిటీతో ఈటీవీలో ప్రసారమవుతున్న టీవీ షోలో సందడి చేయడమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హీరోగా కూడా సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. ఇక అది పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని ఆది ఎన్నో సందర్భాలలో స్వయంగా వెల్లడించాడు. పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే చాలు ఆది రెచ్చిపోతుంటాడు.

ఇదిలా ఉండగా సాధారణంగా సినిమాలను ప్రమోట్ చేయడానికి టెలివిజన్లో ప్రసారం అవుతున్న టీవీ షోస్ లో సినిమా యూనిట్ సందడి చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో ఈటీవీలో ప్రసారమవుతున్న శ్రీదేవి డ్రామా కంపెనీ జబర్దస్త్ ద్వారా కూడా తమ సినిమాలను ప్రమోట్ చేస్తూ ఉంటారు. ఇక ఇటీవల “నేను మీకు బాగా కావాల్సినవాడిని” సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా హీరో కిరణ్ అబ్బవరం అండ్ టీమ్ ఢీ షో లో సందడి చేసింది. ఈ షో లో కిరణ్ గురించి ఆది మాట్లాడుతూ.. “బేసిక్ గానేను పవన్ కళ్యాణ్ గారికి వీరాభిమాని. కళ్యాణ్ గారి మాట విన్నా, ఆయన పాట విన్నా నోటికి తెలియకుండా అరుపులు, చేతికి తెలియకుండా చప్పట్లు, వేళ్లకు తెలియకుండా విజిల్స్ వస్తాయి. నాకు తెలిసి మళ్లీ పవన్ కళ్యాణ్ స్థాయికి వెళ్లే హీరో ఎవరైనా ఉంటే అది కిరణ్ అబ్బవరం” అని ఆది చెప్పుకొచ్చాడు. దీంతో కిరణ్ కూడా ఆది కి కృతజ్ఞతలు తెలియచేశాడు.

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కిరణ్ అబ్బవరం ని పొగుడుతూ పవన్ కళ్యాణ్ తో పోల్చి అంతటి గొప్ప హీరో అవుతావని చెప్పడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆది మీద మండిపడుతున్నారు. ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ లాంటి హీరో ఎవరు ఉండరని కేవలం ఆ ఘనత పవన్ కళ్యాణ్ కి మాత్రమే దక్కుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ అభిమానిది అయ్యుండి అతనితో వేరొక హీరోని ఎలా పోలుస్తున్నావ్ అంటూ మరికొంతమంది ఆది మీద సీరియస్ అవుతున్నారు. అయితే మరి కొంతమంది నెటిజన్స్ మాత్రం బళ్ళు ఓడలు అవ్వచ్చు ఓడలు బళ్ళు అవచ్చు ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు అంటూ కామెంట్ చేస్తున్నారు.